కవిత నెం :97
ఒక మైలు రాయిని నేను
******************
ఒక మైలు రాయిని నేను
నా ప్రయాణంలో
కాని కదిలే మైలు రాయిని నేను
నా ఎదురుబాటలో
ఇది నిజమా ? భ్రమయా ? అనే ఊహ కాసేపు
ఇది అవునా ? కాదా ? అనే యోచన మరి సేపు
ఏది తప్పో ఏది ఒప్పో అనే స్నిగ్దత కాసేపు
ఏది తత్వం ? ఏది వేదం ? అనే సంశయం మరి సేపు
ముళ్ళ బాటలో
మెత్తని పువ్వుల తోటలో
తెలిసి తెలియకున్నట్లు సాగుచున్న
నా అంతరంగం ఇచ్చే జావాబు ద్వారాల వెనుక
ఏ అంతర్యామి లేని ఈ స్వామీ నన్ను
కనుగొంటాడా అని
అలుపు లేని మలుపుల వేకువ
నిచ్చెనతో నడుస్తున్న
తెలిసి తెలియకనే
ప్రశ్నల వర్షాలు
నా హృదయవాకిట
ఆనందాక్షింతలు
నా మనసు తోటన నా అడుగు
అభిమన్యుడిగానే సాగుచున్నది
ఒక్క అడుగుతోనే కాస్త ముందుకు
వెనుక తిరగని విక్రమార్కుడుని కాను
సొమ్మసిల్లని ధర్మరాజుని కాను
పెను తలంపుల పెమ్మట
పెను తుఫాను జోరిట
ప్రేక్షకుడిలా నా పాదం
కదిలేనుగా ఓ పద కవితలా
ఓ చిన్ని తత్వమున్న
ఓ మరమనిషినే నేనిలా
!!!!!!!!!!!!!!!!!
//గరిమెళ్ళ గమనాలు //02. 10. 2014
ఒక మైలు రాయిని నేను
******************
ఒక మైలు రాయిని నేను
నా ప్రయాణంలో
కాని కదిలే మైలు రాయిని నేను
నా ఎదురుబాటలో
ఇది నిజమా ? భ్రమయా ? అనే ఊహ కాసేపు
ఇది అవునా ? కాదా ? అనే యోచన మరి సేపు
ఏది తప్పో ఏది ఒప్పో అనే స్నిగ్దత కాసేపు
ఏది తత్వం ? ఏది వేదం ? అనే సంశయం మరి సేపు
ముళ్ళ బాటలో
మెత్తని పువ్వుల తోటలో
తెలిసి తెలియకున్నట్లు సాగుచున్న
నా అంతరంగం ఇచ్చే జావాబు ద్వారాల వెనుక
ఏ అంతర్యామి లేని ఈ స్వామీ నన్ను
కనుగొంటాడా అని
అలుపు లేని మలుపుల వేకువ
నిచ్చెనతో నడుస్తున్న
తెలిసి తెలియకనే
ప్రశ్నల వర్షాలు
నా హృదయవాకిట
ఆనందాక్షింతలు
నా మనసు తోటన నా అడుగు
అభిమన్యుడిగానే సాగుచున్నది
ఒక్క అడుగుతోనే కాస్త ముందుకు
వెనుక తిరగని విక్రమార్కుడుని కాను
సొమ్మసిల్లని ధర్మరాజుని కాను
పెను తలంపుల పెమ్మట
పెను తుఫాను జోరిట
ప్రేక్షకుడిలా నా పాదం
కదిలేనుగా ఓ పద కవితలా
ఓ చిన్ని తత్వమున్న
ఓ మరమనిషినే నేనిలా
!!!!!!!!!!!!!!!!!
//గరిమెళ్ళ గమనాలు //02. 10. 2014
0 comments:
Post a Comment