Saturday, 11 April 2015

కవిత నెం96:మల్లె పువ్వు

కవిత నెం :96 //మల్లె పువ్వు //

*మల్లె పువ్వు *
రచన : 13 ,హైదరాబాద్


ఇది మనసుని దోచే పువ్వు
ఇది మనసుకి హత్తుకునే పువ్వు
ఇది మన ఊసుల్ని కదిలించే పువ్వు
ఇది హృదయమున్న పువ్వు
ఇది అందమైన పువ్వు
ఇది ఆనందబరితమైన పువ్వు
వెన్నవలె మెత్తని పువ్వు
పాలవలె తెల్లదైన పువ్వు
మగవాడి చూపులని మరల్చే పువ్వు
maguvalaku ఇష్టసఖి ఈ పువ్వు
ప్రేమలను పుట్టించే సుగంధం ఈ పువ్వు
వెన్నెల రాత్రులకు విందునిచ్చేది ఈ పువ్వు
విరులకాంతులను కురిపించేది ఈ పువ్వు
మనసున్న వాళ్ళకు ''మల్లె'' ఇది
అన్యోన్య బంధ బావితులకు ''సిరిమల్లె'' ఇది
అలకరణ ప్రియులకు ''బొండుమల్లె'' ఇది


సిగ్గుతనం
పసిడిమొగ్గతనం
పరిపక్వతకు పరిపూర్ణతనం
మత్తెకించే కైపుతనం
ఆటలాడించే కొంటెతనం
ఆరాధనలో పూజ్యతనం
అలంకరణలో కమ్మతనం
అన్నీ కలగలసి ,సొగసిరిసి
మనకంటూ ఇలలో
సహజాకృత వన్నెల
కిన్నెరసాని నగముల
కుసుమాల కమలాంకిత
కన్నెపువ్వు ఈ ''మల్లె పువ్వు''


!!!!!!!!!!!!!!!!!

Related Posts:

  • కవిత నెం 222 :తప్పు కవిత నెం :222 *తప్పు* తప్పు  చేయకున్నా తప్పేనని ఒప్పించనేల తప్పు చేసి తప్పించుకొనెడివాడి తల తీయకుండనేల తప్పులలో కొన్ని ఒప్పులున్నా తప్పే అనెడి… Read More
  • కవిత నెం 223: హాయ్ బంగారం కవిత నెం :223 హాయ్ బంగారం నీకు నేను గుర్తొస్తున్నానా ? కాని నాకు మాత్రం నువ్వు గుర్తొస్తూనే ఉంటావు అనుక్షణం ......... అనునిత్యం ....... నీ జ్ఞా… Read More
  • కవిత నెం 225: ఓ అభిమాని ఆలోచించు కవిత నెం : 225 శీర్షిక పేరు : ఓ అభిమాని ఆలోచించు  నువ్వు పుట్టింది నీకోసం  నీ జీవితం నీ కోసం , నీ కుటుంబం కోసం  నువ్వు పుట్టాకే తెలి… Read More
  • కవిత నెం 224 :విజయవాడ లో -కృష్ణా పుష్కరం కవిత నెం 224 * విజయవాడ లో -కృష్ణా పుష్కరం  *  ఇప్పుడిప్పుడే  రూపుదిద్దుకొంటున్న   అమరావతిలో అందంగా ఆడుకుంటుంది కృష్ణమ్మ&nb… Read More
  • కవిత నెం 226:దసరా సంబరం కవిత నెం :226 దసరా సంబరం  దసరా వచ్చిందండోయ్ - సరదా తెచ్చిందండోయ్  ''విజయ దశమి '' అను ఒక పేరుగా  ''దుర్గా నవమి ''అను  మరొక పే… Read More

0 comments:

Post a Comment