Monday, 13 April 2015

కవిత నెం 142:గుప్పెడు గుండె

కవిత నెం :142

గుప్పెడు గుండె కోసం 
కొండంత ప్రేమను నేను 
నా మనసులో దాచి ఉంచా

కనురెప్పల మాటున 
కనుపాపై నా కళ్ళలో తన రూపాన్ని 
నా కన్నీళ్ళలో దాచి ఉంచా 

మూగబోయిన  నా మాటలశబ్దంలో 
తనపై రేగిన ప్రేమ ప్రవాహాన్ని 
నా మౌనంలోదాచి ఉంచా 

ఆనందక్షనాలే నా చుట్టూ యున్నా 
తనకోసం కరిగే నా భగ్నప్రేమను 
నా ఊపిరిలో దాచి ఉంచా  

విడిపోయిన తన చెలిమిని స్మరిస్తూ 
గడచినా తన కలిమి బందాన్ని సృశిస్తూ 
వెతకలేక తన కోసం 
వెంటాడుతూనే ఈ నా యెర్రి ప్రేమను 
నా అణువణువునా దాచి ఉంచా 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



Related Posts:

  • కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు) కవిత నెం :306 * ప్రేమ సంకెళ్లు * ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంద… Read More
  • కవిత నెం : 294(వయ్యారిభామ) కవిత నెం : 294 *వయ్యారిభామ  * ఎందుకు వస్తావు ఎందుకు వెళ్తావు నా మనసుని గిల్లుతావు గిల్లి లొల్లి పుట్టిస్తావు ఇంతలో మళ్లీ కానరావు పెదవిపై నవ్… Read More
  • కవిత నెం 270: నిన్నే ప్రేమిస్తా కవిత నెం :270 *నిన్నే ప్రేమిస్తా ** ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను ప్రేమకు అర్ధమే నీవని ,నీవ… Read More
  • కవిత నెం :288(నీ ప్రేమలో నా గమనం) కవిత నెం :288 * నీ ప్రేమలో నా గమనం * నిన్ను చూస్తే నా కలం సాగుతుంది నిన్ను చూసాక నా కవిత పొంగుతుంది నీవున్న చోట ప్రేమ పరిమళిస్తుంది నీతో కలిసి నడిచే… Read More
  • కవిత నెం :339(జబ్బు మనుషులు) కవిత నెం :339 కవిత పేరు : జబ్బు మనుషులు మనస్ఫూర్తిగా నవ్వలేరు నవ్వినా ఆనందాన్ని అనుభవించలేరు వయసుకీ ,మనసుకీ సంబంధం ఉండదు విచిత్రదోరణిలోనే బ్రతికేస… Read More

0 comments:

Post a Comment