Saturday, 11 April 2015

కవిత నెం 119:గెలుపు ఓటమిల నైజం

కవిత నెం :119
*గెలుపు ఓటమిల నైజం * గెలిచే వారు ఆనంద విహారాలు చేస్తూ ఉంటారు
గెలిచే వారు వేర్రివిలయతాండవం చేస్తూఉంటారు 
గెలిచే వారు తమ భలప్రదర్సన చేస్తూఉంటారు
గెలిచే వారు లోకంతో పని లేకుండా ప్రవర్తిస్తారు
గెలిచే వారు గర్వబంఘ పడుతూ ఉంటారు 
గెలిచే వారు తమసృతిని తప్పుతుంటారు 
గెలిచే వారు తమ క్యాతిని డప్పు కొట్టుకుంటారు 
మరి
ఓడిన వాళ్ళు విశాధచాయాల్లో గడుపుతుంటారు 
ఓడిన వాళ్ళు తమ గోడుల గోడలలో నలుగుతుంటారు 
 ఓడిన వాళ్ళు కాసేపు ఒంటరితనంలోనే గడపాలనుకుంటారు
ఓడిన వాళ్ళు కసితో రగిలిపోతుంటారు 
ఓడిన వాళ్ళు తమ తదుపరి మార్గాలకై అన్వేషిస్తుంటారు
ఓడిన వాళ్ళు తమ కుళ్ళు కుట్రలలో సతమతమవుతుంటారు 
ఓడిన వాళ్ళు ప్రయాసపయనం  చేస్తూ ఉంటారు

గెలుపు ఓటములు ఆది గురువులు
గెలుపు ఓటములు అన్న దమ్ములు
గెలిచినా ఓడినా మన మంచికే కదా 
గెలుపు నీకు జీవిత మలుపు నిస్తుంది
ఓటమి నీకు విజయకాంక్ష నిస్తుంది 
గెలుపు నీకు సత్యానందం నిస్తుంది 
ఓటమి నీకు లక్ష్యసిద్ది నిస్తుంది

గెలుపైన గర్వపడటం
ఓటమిన నిసృహపడటం
మానవ నైజం
అది మన అసంకల్పిత చర్యం 
అది గ్రహించి తెలుసుకొనుట 
మన దర్మం 
అన్నీ కలిపి సాగితేనే 
మన జీవిత పయనం
.............
!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



Related Posts:

  • కవిత నెం145:నన్ను మార్చిన నీవు కవిత నెం :145 *నన్ను మార్చిన నీవు * కదలని బండరాయిలా ఉన్నా ఇన్నాళ్ళు  నన్ను కదిలే శిల్పాని గా చేసావు  గాలికి ఊగని గోడగా  నిలుచున్నా … Read More
  • కవిత నెం 142:గుప్పెడు గుండె కవిత నెం :142 గుప్పెడు గుండె కోసం  కొండంత ప్రేమను నేను  నా మనసులో దాచి ఉంచా కనురెప్పల మాటున  కనుపాపై నా కళ్ళలో తన రూపాన్ని&nb… Read More
  • కవిత నెం144:చెలీ నీవెక్కడ కవిత నెం :144 *చెలీ నీవెక్కడ * రోజూ గడుస్తున్నదే  పొద్దు వాలుచున్నదే  చెలీ నీ జాడ ఏడున్నదే మబ్బు పట్టుతున్నదే  చినుకు పడుతూ ఉన… Read More
  • కవిత నెం143:ప్రియుడు కవిత నెం :143 ప్రేయసి రావే నా ఊర్వసి రావే అనే పాటకు ప్రియురాలి హృదయం స్పందిస్తుందా ? ప్రియుడితో ప్రేమాయణం సాగించేటప్పుడు తన కంటి చూపుతో వాడ… Read More
  • కవిత నెం146:బంధాలు కవిత నెం :146 ఏమిటి ఈ బంధాలు  ఏమిటి ఈ బావుకతలశ్రావ్యాలు  ఏమిటి ఈ నేస్తాలు  ఏమిటి ఈ పరిచయాలు  ఏమిటి ఈ ఆనంద క్షణాలు  ఏమ… Read More

0 comments:

Post a Comment