Monday, 13 April 2015

కవిత నెం141:మరచిపో మనసా

కవిత నెం :141

మరచిపో మరచిపో మరచిపో మనసా 
విడిచిపో విడిచిపో విడిచిపో మనసా 
గతం జ్ఞాపకాలు -గుర్తు రానీయకు 
గుర్తుచేస్తూ గుర్తుచేస్తూ -గుబులునే రేపకు 

అందమైన బృందావనం లాంటి 
గతము నాది కాదు 
బందమైన అనుబందమైన 
అది ప్రేమ పొదరిల్లు కాదు 

నా గతమంతా - నీటిముల్లు
నా గతమంతా - చేదుపల్లు
స్మరించి వాటిని సంతోషవాకిటి
నే చేరలేను నే చేరలేను 

ఆహ్వానించే ఆత్మీయఅతిది లాంటి 
గతము నాది కాదు 
ఇష్టమైన ఇష్టపడుచున్న 
నా ప్రియతము ఏది కాదు 
నా గతమంతా -మబ్బుముసురు 
నా గతమంతా - చేదుచిగురు 
పిలిపించి వాటిని పులకింత లోకిలి 
నే చూడలేను నే చూడలేను 

''వెలుతురిని చూసి చేకటి తప్పుకునేలా
వర్తమానాన్ని చూసి గతం గాయమైపోతుంది 
కాని నా ఈ గతం మానలేని గాయమై 
నన్నెందుకిలా వెంటాడుతుంది వెంటాడుతుంది 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

Related Posts:

  • కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు) కవిత నెం :306 * ప్రేమ సంకెళ్లు * ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంద… Read More
  • కవిత నెం :324(నా అభిలాష) కవిత నెం :324 *నా అభిలాష * ఊసులాడుటకు ఊసు కావలెయును నిన్ను పొగడుటకు ప్రాస కావలెయును మిస మిస మనే నీ నొసల మధ్యన ఎర్రటి తిలకమై నుదురు కావలెయును నీ క… Read More
  • కవిత నెం :335 (అన్నపూర్ణా - వందనం ) కవిత నెం :335 అన్నపూర్ణా - వందనం అమ్మలగన్నమాయమ్మ ఏ దీవెన దక్కిందోయమ్మ ఏ దేవత వరమైనవమ్మా మా తల్లి డొక్కా సీతమ్మా మా పాలిట అన్నపూర్ణమ్మ మా ఆకలి తీర్… Read More
  • kavita samkya :332(నా మౌనం) kavita samkya :332 శీర్షిక : నా మౌనం  గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు  హైదరాబాద్ కకావికలమై క్రోధిస్తున్నది జకాశకలమై జ్వలిస్తున్నది తపోభూమిలో తపి… Read More
  • కవిత నెం :323(ప్రియ మధనం) కవిత నెం :323 *ప్రియ మధనం * పిలిస్తే పలుకుతావు పలకరించే పిలుపునివ్వవు అందుకోమని చేయినిస్తావు నీ చేతివేలు చివర్నైనా తాకనివ్వవు ముద్దమందారంలా మెరిసి… Read More

0 comments:

Post a Comment