Saturday, 11 April 2015

కవిత నెం 113:దీపావళి

కవిత నెం :113

''దీపావళి శుభాకాంక్షలు ''
**********************************
''కాకరఒత్తి '' లా మీ ఇంట్లో కాంతులు విరజిల్లాలనీ
''చిచ్చుబుడ్డి'' లా మీ నవ్వులు వికసించాలనీ
''భూచక్రం'' లా సిరిసంపదలు విరిసిల్లాలనీ 
''విష్ణుచక్రం'' లా విజయం మీ వెంటనే ఉండాలనీ 
''మతాబుల'' వెలుగుకి సమస్తరోగాలుమాయమవ్వాలనీ 
''లక్ష్మీ ఓటు '' గా ధైర్యం తో ముందుకు సాగాలనీ 
''అటంబాంబు'' లా అవలీలగా మీ జీవితం 
''రాకెట్'' లా ఆకాశమంతా విహరిస్తూ 
''తారాజువ్వ'' లా మీ ఉత్తేజం ప్రజ్వరిల్లుతూ 
''వెన్న ముద్ద'' లాంటి మనసుతో 
''సీమటపాకాయ'' లా చింత లేకుండా 
''అవ్వాయ్ సువ్వాయ్'' లాగ సుతిమెత్తని 
కుసుమంగా విలాసమైన ఆనందమైన 
మీ జీవన సాగర ప్రపంచం లో 
మీ జీవితం తాపీగా గడవాలనీ 
కోరుకుంటూ
నా ఈ చిరు లాస్యమైన 
''దివిటీ'' తో మీకు ,మీ కుటుంబసభ్యులు అందరికి 
స్వచ్చమైన ''నేతి  మిఠాయి '' లా 
''దీపావళి శుభాకాంక్షలు ''



Related Posts:

  • కవిత నెం :296(* ఎందుకు గాబరా *) కవిత నెం :296 * ఎందుకు గాబరా * ఒకరికోసం నీ గమ్యం ఆగకూడదు ఒకరికోసం నీ మార్గం నిర్దేశింపబడకూడదు ఎవరు  నువ్వో ఈ భూమిపైకి రాకముందు ఎవరు నువ్వు అనే… Read More
  • కవిత నెం269: నిశీధిలో నేను కవిత నెం :269 * నిశీధిలో నేను * నిశీధిలో నేను  దిక్కులు  చూస్తున్నాను  ఆరుబయట మంచం మీద  చల్లని గాలి మెల్లగా చేరి … Read More
  • కవిత నెం :302(మాతృత్వపు ధార) కవిత నెం :302 *మాతృత్వపు ధార * తాను తల్లి కాబోతున్న అనే వార్త వినగానే తన్మయత్వంతో పులకించిపోతుంది ఆ తల్లి హృదయం ఎన్నో ఆశలు కళ్లలో దాచుకుని ఎన్నో ఊ… Read More
  • కవిత నెం263:మేలుకో నవతేజమా కవిత నెం :263 *మేలుకో నవతేజమా * సమాజాం పిలుస్తుంది రా కదలిరా నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా కలం పట్టి గళం పాడే చోట… Read More
  • కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న ) కవిత నెం :340 కవితా శీర్షిక : నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న  నువ్వంటే ఇష్టం నాన్న నీ రూపంటే ఇష్టం నాన్న నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న న… Read More

0 comments:

Post a Comment