Saturday, 11 April 2015

కవిత నెం122:

కవిత నెం :122

ముసురు కమ్మి చినుకునాపలేదు 
గ్రహణం పట్టి సూర్యుని కాంతిని దాచలేదు
వెనుకడుగు వేసినా పులి పంజా వేట మానదు 
నీటిప్రవాహం ఎంతవున్న సుడిగుండాన్ని తప్పించలేదు 
అగ్ని ఎంత ఎగిసిపడుతున్నా నీటిచుక్క ఓడిపోదు
విషనాగుల ముందు ముంగిస బెదరదు 
నిండు కుండ తొణకదు
సంద్రమేన్నడూ ఎండదు 
తోకచుక్కలు ఎన్నిరాలుతున్నా 
అంతరిక్షం అంతరించదు 
జీవితం అనేది ఒడిదుడుకుల సంగమం 
కష్ట సుఖాల సాగరం 
ఎదురుదెబ్బలు తగులుతూ వుంటాయి 
స్పీడ్ బ్రేకార్స్ మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతూ వుంటాయి 
ఎన్ని ఎదురు వస్తున్నా కాలాన్ని ఎవ్వడూ క్యాచ్ చేయలేదని తెలుసుకో
గోడను తన్నిన బంతిలా సాగిపో 
దెబ్బతగిలితే కలిగే బాధ 
మన విజయాన్ని గుర్తు చేసే సంకేతంలా వుండాలి 
అవరోదాలు మన స్నేహితులు 
ఆటంకాలు మన సన్నిహితులు 
ఆపదలు మన అపద్మాన్డవులు 
మంచిని ఆహ్వానించే మనసు నీకున్నప్పుడు 
చెడును స్వాగతించే అబిలాష కూడా ఉండాలి 
తప్పు జరిగిందని తల్లదిల్లవద్దు 
చెడు జరుగుతుందని సంకోచించ వద్దు 
నిరాశతో నీ ప్రయాణాన్ని నిశ్రుహ పరచవద్దు 
అతిశయం లేని జేవితంలో నిర్విగ్నంగా ,నిర్మలంగా 
నీ నడకను సాగించు నేస్తం 

!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



Related Posts:

  • కవిత నెం 211:నిజం అబద్దంల నిజం కవిత నెం :211 నిజం అబద్దంల నిజం   నిజమెప్పుడూ లోపలే దాగుంటుంది  ఎందుకంటే అబద్దం అందంగా ఉంటుంది కాబట్టి  నీకు తెలిసింది కాబట్టి… Read More
  • కవిత నెం 209:అసహనం కవిత నెం :209 //అసహనం // చంటి పిల్లవాడికి  తను అడిగింది ఇవ్వకపోతే  వాడు అసహనమే చూపుతాడు  పిల్లలు తమ మాట విననప్పుడు  చెప్పి చెప… Read More
  • కవిత నెం 231:ఆర్టీసీ బస్సు కవిత నెం :231 * ఆర్టీసీ బస్సు * ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు మీది మీదికొస్తావు ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు మొత్తం తిరుగుతావ… Read More
  • కవిత నెం 218:మాటే మంత్రం కవిత నెం :218 * మాటే మంత్రం * మన మాట సంకల్పితంగా వచ్చేది  మన నోటి నుండి జారే ప్రతీ మాటకు మనమే బాధ్యులం  అనాలోచితంగా కొన్ని మాట్లాడితే&nbs… Read More
  • కవిత నెం 232 :కన్నీటి చుక్క కవిత నెం  :232 ***** కన్నీటి చుక్క ***** ఆకాశంలో పొడుస్తుంది వెలిగే చుక్క  మన అంతరాళంలో  ప్రవహిస్తుంది ఈ కన్నీటి చుక్క  … Read More

0 comments:

Post a Comment