Saturday 11 April 2015

కవిత నెం87:కులము

కవిత నెం :87
కులము కులము అంటూ కూడికలు ఎందుకు ?
మతము మతము అంటూ మైనస్సులు ఎందుకు ?
సమానత్వమనే భావనతో సరి తూగలేరా ?
వ్యంగంగా కులమంటూ పరిహాసమేలా ?
నువ్వొచ్చినాక పుట్టలేదు ఈ కులము 
నువ్వు పోయేటప్పుడు నీ వెంట రాదు ఏ మతము 
అన్ని దేశములలో గొప్పది కదా మన దేశము 
భిన్నత్వంలో ఏకత్వమున్న ప్రాంతీయ దేశము 
పరాయివాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటుంటే
కులమంటూ నొచ్చుకుంటూ నీవు - ఈ వెలివేత ఎందుకు ?
జాతులెన్ని ఉన్నా మన నీతి ఒకటేకదా 
భాషలెన్ని ఉన్నా వాటి భావం ఒకటే అనే సత్యాన్ని మరువక 
మనమంతా మనుషులమే అన్న భావనతో  మనసు పెట్టి చూడు 
తరతరాలుగా వస్తున్న ఈ కులగజ్జిని రూపుమాపి 
ఇష్టంగా నీ ఆత్మీయతను పంచి చూడు 
ఐకమత్యము మనమెరిగిన మతము 
మానవత్వము మనలోని సుగుణము 
ఏ కులమూ గొప్ప కాదు 
ఏ మతమూ అధికము కాదు 
మనదంతా ప్రజాకులము 
మనమంతా మనుషులము 
స్వార్ధంతో కూడియున్న  కులపిచ్చిని వదలండి
వెర్రితత్వంతో  మగ్గియున్న మతపీడను మానండి
అందంగా ఆలోచించగల హృదయం మనది 
అందరం ఒక్కటే అని మరువకండి , మరువకండి 

//గరిమెళ్ళ రాజేంద్రప్రసాదు //
 


0 comments:

Post a Comment