Saturday, 11 April 2015

కవిత నెం88:బార్యంటే

కవిత నెం :88

బార్యంటే ఎందుకురా చులకనగా చూస్తావు
బార్యంటే ఎందుకురా భరితెగించి పోతావు
మూడు ముళ్ళ బంధమన్నది నీకు గుర్తురాదా
ఏడు అడుగులు కలిసినప్పుడు నీకు తెలియలేదా
నాతిచరామి అన్న నాలుక మొద్దు బారినదా
చిటికినవేలు పట్టితివి కదా  ఇప్పుడా చెయ్యి నీకు లేదా

బార్యంటే నీకు తోడుగా
నీవెంటే ఉండే నీడగా
నీలోని సగ భాగమురా
నీ రూపానికి ప్రతిరూపమురా
తనకెందరున్నా అన్నీ వదిలి
నిను నమ్మి వచ్చినదిరా
బంధువులు ఎందరున్నా
తన కుటుంభం నీవేరా
నీకు అండగా నిలిచే వృక్షం
నీ ఇంటిలో వెలిగే దీపం
తానేరా నీకు సౌభాగ్యం
నీ భవబంధాలకు అనురాగం 

భార్య  విలువ తెలుసుకో
తన మనసు గెలుచుకో

భార్యంటే కాదురా నీకు బరువు
భార్యంటే కాదు నీ హక్కు
భార్యంటే కాదు నీ అవసరం
భార్యంటే కాదు నీ అహంకారం


Related Posts:

  • కవిత నెం148:సీతాకోక చిలుక కవిత నెం :148 సీతాకోక చిలుక  వన్నె చిన్నెలున్న సీతాకోకాచిలుక రెక్కలకు రంగులనే కల్గినావంట స్వేచ్చకు రెక్కలు తొడిగే ప్రాణివి నీవు చిరునవ్వుల్ని … Read More
  • కవిత నెం150:హనుమాన్ జయంతి కవిత నెం :150 హనుమాన్ జయంతి "యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్" "యెక్కడెక్క… Read More
  • కవిత నెం149:చరఖా కవిత నెం :149 చరఖా భారత స్వాతంత్రోద్యమంలో  మేటి రధసారధి మువ్వన్నెల జెండాలో రూపుదిద్దబడిన తొలిచిహ్నం చేనేత కళాకారులకు వారసత్వపు కల్పవృక్షం… Read More
  • కవిత నెం152:కవి అంటే ఎవడు ?(నేటి కాలంలో ) కవిత నెం :147 కవి అంటే ఎవడు ? (నేటి కాలంలో ) తెల్ల చొక్కా ధరియించే వాడా ! మాసిన గడ్డం కల్గిన వాడా ! పదిమందిలో సాహిత్యం మాట్లాడేవాడా !  పల… Read More
  • కవిత నెం 151:ఎందుకంత చిన్న చూపు ? కవిత నెం : 151 ఎందుకంత చిన్న చూపు  ? (ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు ) ఎందుకంత చిన్న చూపు  ? మనుషులంటే , మమతలంటే  ఎందుకంత చిన్న చూ… Read More

0 comments:

Post a Comment