Saturday, 11 April 2015

కవిత నెం 95:ఓ సంద్రమా

కవిత నెం :95//ఓ సంద్రమా //

* ఓ సంద్రమా !*
రచన : 14 , హైదరాబాద్


ఓ సంద్రమా !
నీ సున్నిత సాన్నిహిత్యం సుమదురమైనది
నీ తిమ్మిరి తుంటరి ఝూమ్కారం అనుభూతియైనది
కోటి కనుల ఉషస్సుల సూర్యోదయం నీకు రూపమైనది
అజరామర మకుటం నీ అంతరాత్మవేషం
ఈ అవనిలో ఆవిరైయున్న నీ నీటి ప్రవాహం
ఎన్ని వసంతాలైనా వేలుగొందును నీ యందునా
కన్నీటి బాష్పాలు చెరిగిపోవును నీ చెంతన
రేయైనా , పగలైనా కాంతిపుంజం నిన్ను కాచియుంచునా
దేదీప్యామానాలైనా ఈ దివియందు నీకు దాసోహమే
అదరహో సముద్రమా నీ చెలిమి సంతకం
ఖజురహో శిల్పాలైనా నీ కలిమి యే కదా చరితం
ఆహ్వానించు వారికి అపురూపం నీ ఆత్మీయత
అనుభవించగానే వదలలేరు నీ తియ్యని మమత
ఎన్ని ప్రాణులుఉన్నవే నీ లోకమంటి రాజ్యమున
ఆపద్బాన్దవువై హత్తుకొంటివి నీ హృదయమున
అమ్మలాగా లాలించును ఎగసే నీ ప్రతి అల
ఊయలలో ఊగినట్టుగా ఊహనిచ్చును నీ జోల
ఎలాగా నీవు పుట్టావో మిత్రమా
మా జన్మ జన్మలకు నీ పయనం నిరంతరమా
ఎంతముద్దుగున్నది మెత్తని నీ ఇసుకపరుపు
అదియేనేమో నీవు కప్పుకునే పట్టువస్త్రము
అందాలను అద్బుతంగా చూపించును నీ నయనం
ఆకట్టుకునేలాగా అందివచ్చును నీ బంధం
రానీయకు సుమా ఎన్నడూ నీ ఎర్రటికోపం
విలవిలలాడే  ప్రళయాలకు  అందిస్తూ  నీ  హస్తం 
వారెవ్వా అంటారే నిన్ను చూసిన  జనం 
స్వేచ్చగా బ్రతికేస్తూ నీ నీడలో  ప్రతీక్షణం 
సృష్టి అంతా వ్యాపించియున్న నీ పాదం 
నీ  ప్రేమతోనే సాగాలి  ఈ ప్రకృతి    పర్వం 


!!!!!!!!!!!!!!!!!!!1

Related Posts:

  • కవిత నెం 162:అందమా .... చంద్రబింభమా కవిత నెం :162 అందమా .... చంద్రబింభమా నన్ను నిద్దురపోనీయక చేసే రూపమా ప్రాణమా ... నా ప్రతి రూపమా నా  ఊపిరిని అందనీయకుండా చేసే పరువమా కావ్యమా ...… Read More
  • కవిత నెం161:ఎందుకిలా చేస్తావు కవిత నెం :161 *ఎందుకిలా చేస్తావు * మబ్బువై  కప్పేస్తావు  మనసు నిండా దాగుంటావు  మల్లెవై మురిపిస్తావు  ముద్దు ముద్దుగా గుర్తొస్తావు… Read More
  • కవిత నెం 165:అంతా ప్రేమమయం కవిత నెం :163 *అంతా ప్రేమమయం*  ప్రేమలేని ప్రక్రుతి ఉండదు  ప్రేమలేని జీవం ఉండదు  ప్రేమలేని సృష్టి ఉండదు  ప్రేమలేని బంధం ఉండదు&… Read More
  • కవిత నెం 163:ఒక ఉల్లి కధ కవిత నెం :163 ఒక ఉల్లి కధ ***********************  అనగనగా ఒక ఉల్లి  అవసరం ఇది మనకు డైలీ  వంటలరుచిలో ఇది బుల్లి చెల్లి  ఆరోగ్యాన్… Read More
  • కవిత నెం160:పొగ -సెగ కవిత నెం : 160 పొగ -సెగ  కంటికి కనపడే ఆవిరి లాంటి రెండక్షరాల రూపం ప్రపంచాన్నే తన గుప్పిటపెట్టుకున్న వ్యసనదాహం యువతరాన్నిఉర్రూతలూగించే ఒక మైకం … Read More

0 comments:

Post a Comment