Saturday, 11 April 2015

కవిత నెం131:ఇంకా ఇంకా అనుకుంటే

కవిత నెం :131
ఇంకా ఇంకా అనుకుంటే
ఇంకా ఇంకా అనుకుంటే
ఏముంటుంది ?
ఇంకా ఇంకా అనుకుంటే
ఏమి వస్తుంది ?
ఆశకి కావాలి ఇంకా ఇంకా
అవకాశానికి కావాలి ఇంకా ఇంకా
అన్వేషణ కి కావాలి ఇంకా ఇంకా
అత్యుత్తమ  స్థానానికి కావాలి ఇంకా ఇంకా
ఆత్మీయత చూపించే వారున్నామన పరిచయాలు ఇంకా ఇంకా 
బంధాలు ఎన్ని వున్నా మనం వెతికేది  ఇంకా ఇంకా
పాత జబ్బులు ఎన్నివున్నా కొత్త జబ్బులు పుట్టేవి ఇంకా ఇంకా
డబ్బు ఎంత వున్నా దాని జాడ తెలియదు ఇంకా ఇంకా
గెలుపు మన వెంట వున్నాదాని గమనము ఇంకా ఇంకా
అపజయాలు వెంటాడుతున్నా పోరాడాలి ఇంకా ఇంకా
మన చుట్టూ ,మన కంటూ , మన కోసం ఏమున్నా 
మనిషి సంతృప్తి తీరదు ఇంకా ఇంకా

!!!!!!!
గరిమెళ్ళ రాజా



Related Posts:

  • 341(లోకంలో ఆడపిల్ల) కవిత నెం  :341 కవితా శీర్షిక : లోకంలో ఆడపిల్ల ప్రతీ రోజు పేపర్లో ప్రతీ రోజు వార్తల్లో ఎక్కడో ఒకచోట కనిపించే అమానుషం వినిపించే ఆర్తనాదం ఏ తల్లి… Read More
  • చిరంజీవి కొణిదెల శివశంకరవర ప్రసాదు "చిరంజీవి" సినీ రంగం లో జన్మించాడు పునాదిరాళ్లతో పునాది నిర్మించుకుని స్వయంకృషితో స్వయంగా ఎదిగినాడు కోట్… Read More
  • గురువే నమః మనుమసిద్ధి కవన వేదిక అంశం :గురుబ్యోనమః శీర్షిక : గురువే నమః అక్షర జ్ఞానాన్ని అందించే గురువుకు నమః అజ్ఞాన తిమిరాన్ని తొలగించే గురువ… Read More
  • 329(తెలంగాణ -జలధార) కవిత నెం :329 *తెలంగాణ -జలధార * తెలంగాణ జల మణిహార మాగాణం కొత్త జలాశయంతో నిండుతుంది తెలంగాణం నీటికొరతను రూపుమాపుటకు నిలచే జలద్వీపం ప్రతి చినుకును ఒ… Read More
  • కవిత నెం : 295(దిక్సూచి) కవిత నెం : 295 *దిక్సూచి * కసిగా ఉండాలి మసి తొలగించాలి పట్టుదలతో నువ్వే విజయం పొందాలి క్రమశిక్షణ ఉండాలి విద్యార్థిగా మెలగాలి నీ ఓర్పుతో ఉన్నతంగా … Read More

0 comments:

Post a Comment