Monday, 13 April 2015

కవిత నెం144:చెలీ నీవెక్కడ

కవిత నెం :144
*చెలీ నీవెక్కడ * రోజూ గడుస్తున్నదే 
పొద్దు వాలుచున్నదే 
చెలీ నీ జాడ ఏడున్నదే

మబ్బు పట్టుతున్నదే 
చినుకు పడుతూ ఉన్నదే 
చెలీ నీ తోడూ ఏడున్నదే 

సూర్యుడు వస్తున్నాడు 
చంద్రుడు పోతున్నాడు 
నీ గురించి నాకెవ్వరూ చెప్తారు 

పావురాన్ని పెంచాను 
రామచిలుకనే ఉంచాను 
నీ కేరాఫ్ అడ్రస్ వాటికి ఏమని చెప్పను 

అమాంతంగా ఉలిక్కిపాటు 
అనుమానంగా అటు ఇటు చూపు 
చూస్తున్నా నీ రూపాన్నే దిక్కులవైపు 

సీతాకోకచిలుకని అడిగా 
ఈ రంగులరూపం నీవని 
ప్రతి పువ్వుపై తుమ్మెదనడిగా
నా చెలి పరిమళం ఏదని 

వింటున్నావా వెన్నెల కూనా 
ఈ గడిసే రాతిరి జామునా
కంటున్నావా కమలం పువ్వా 
నడిచే నీటి లోతునా 

ఉన్నా, నేనున్నా వేచియున్నా 
రావే, దరిరావే ఓ మైనా 

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

Related Posts:

  • కవిత నెం 121:ఆడవారు కవిత నెం :121 //ఆడవారు// ఆడవారు అందంగా ఉంటారు. పొగరుగా ఉంటారు,వగరుగా ఉంటారు  స్వీట్ గా ఉంటారు ,హాట్ గా ఉంటారు. అమితానందం చూపుతారు కాసేపు&nb… Read More
  • కవిత నెం123:జననం కవిత నెం :123//జననం // *******జననం ****** సూర్యునితోనే వేకువ జననం  చంద్రునితోనే వెన్నెల జననం  మేఘం తోనే వర్షం జననం  వర్షంతోనే … Read More
  • కవిత నెం122: కవిత నెం :122 ముసురు కమ్మి చినుకునాపలేదు  గ్రహణం పట్టి సూర్యుని కాంతిని దాచలేదు వెనుకడుగు వేసినా పులి పంజా వేట మానదు  నీటిప్రవాహం ఎంతవ… Read More
  • కవిత నెం124:కవిత్వం కవిత నెం :118//కవిత్వం // కవిత్వం అనేది కలలు కాదు కవిత్వం అనేది ఒక కలం  కవిత్వం అనేది ఒక గలం కవిత్వం అనేది కల్పితం కాదు కవిత్వం అనేది ఒక వ… Read More
  • కవిత నెం120:సారీ సో సారీ అక్కా కవిత నెం :120 సారీ సో సారీ అక్కా  ఐ యామ్ రియల్లీ సారీ అక్కా  చిన్నవాడినే కదా నీముందు  చిన్న చూపు ఎందుకు ముందు ముందు  చేసిన … Read More

0 comments:

Post a Comment