Saturday, 11 April 2015

కవిత నెం123:జననం


కవిత నెం :123//జననం //
*******జననం ******
సూర్యునితోనే వేకువ జననం 
చంద్రునితోనే వెన్నెల జననం 
మేఘం తోనే వర్షం జననం 
వర్షంతోనే సంద్రం జననం 
సంద్రంతోనే ముత్యం జననం 
పువ్వులలోనే పరిమళం జననం 
అందమైన ఈ ప్రక్రుతి జననం 
జీవంలోని ఊపిరి జననం 
సాగే నడకకు అడుగు జననం 
అడుగులతోనే పయనం జననం 
పయనం చేయగా గమ్యం జననం 
కార్యసాదనలో లక్ష్యం జననం 
లక్ష్యంకోసం సంకల్పం జననం 
కృషి చేయగా  విజయం జననం 
ఏదైనా ఒక కార్యంకోసం మన జననం 
జననం అన్నది ప్రతిజన్మల వరం 
జన్మించిన మనము అదృష్టవంతులం 
ఈ జన్మలో ఏదైనా చేయుట మన దర్మం 
ఎందుకు ఈ జన్మ అని అనుకోవటం కన్నా 
ఆహా! ఏమి జన్మ అనుకుంటూ సాగుదామన్న 

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 


Related Posts:

  • కవిత నెం117:వెక్కిరింపు కవిత నెం :117 *వెక్కిరింపు * చందమామను చూసి సూర్యుడు వెక్కిరిస్తాడా  నువ్వెంత చల్లగా ,హాయిగా ,అందంగా ఉంటావని  ఆకాశాన్ని చూసి నెల వెక్కిర… Read More
  • కవిత నెం159:వేశ్య ఎవరు ? కవిత నెం :159 వేశ్య ఎవరు ? ఏ  బ్రహ్మకలం నుండి జారిన పదం ఇది  ఏ పరబ్రహ్మ సృష్టించిన జన్మ ఇది  ఎవ్వరు ఈమెనిలా మార్చివేసినది  ఏ ద… Read More
  • కవిత నెం92:ఓ మతి స్తిమితం లేని మానవ జీవమా కవిత నెం :92 కవిత పేరు : ఓ మతి స్తిమితం లేని మానవ జీవమా రచన : రాజేంద్ర ప్రసాద్ రచన సంఖ్య : ఫిబ్రవరి (5 ),T (24 ) స్థలం : హైదరాబాద్, … Read More
  • కవిత నెం 95:ఓ సంద్రమా కవిత నెం :95//ఓ సంద్రమా // * ఓ సంద్రమా !* రచన : 14 , హైదరాబాద్ ఓ సంద్రమా ! నీ సున్నిత సాన్నిహిత్యం సుమదురమైనది నీ తిమ్మిరి తుంటరి ఝూమ్కారం … Read More
  • కవిత నెం :311(మన పల్లెసీమ) కవిత నెం :311 మన పల్లెసీమ ప్రకృతితో దర్శనమిచ్చేది బద్దకాన్ని వదిలించేది ఆరోగ్యాన్ని ప్రసాదించేది ''మన పల్లె సీమ '' అందాలతో విందుచేసేది ఆమని సొ… Read More

0 comments:

Post a Comment