Saturday, 11 April 2015

కవిత నెం 102:ఈ క్షణమే నీ సొంతం

కవిత నెం :102
*ఈ క్షణమే నీ సొంతం *
గడిచే ఈ క్షణమే ఆనందం 
ఈ క్షణాన్ని ఆనందించే ఓ నేస్తం 
చిరునవ్వు నీ ఆయుధం 
చింతల్ని వదిలేయ్ నేస్తం 
సాగిపో ,రేగిపో ముల్లబాటల్లో
సాధ్యమే చూపించు నీ కార్యంలో 
కన్నీటిప్రవాహమే ఉరికోస్తున్నా 
కసితోటికాలమే బందిస్తున్నా 
ఎదురీతల్లో ఆనందం చూడు 
నీ కష్టంలోని సౌఖ్యం చూడు 
గాయమెంత తగిలినా గాబరా వద్దు 
నీ గుండెలోని సంకల్పం ఆపనువద్దు  
ఎవరేమి కాదులే మనకెక్కువ
వెన్నుంటే సంతోషాలే మనకుండగా 
నిర్బయంగా నీడల్ని తరిమెయ్యరా
దైర్యంగా నీ అడుగు సందించరా 
గెలిచే క్షణమే ముందుందిరా 
ఓటమిలెన్ని ఉన్నా ఓడిపోవునురా 


!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

Related Posts:

  • కవిత నెం 206:ఫేస్ బుక్ స్నేహాలు కవిత నెం :206 ఫేస్ బుక్ స్నేహాలు ముఖాలు కనపడవు - ముఖ చిత్రాలు ఉంటాయి  మనసు తెలియదు - మాటలెన్నో చెప్తాయి  చిరునామా తెలియదు - కొత్త స్నేహాల… Read More
  • కవిత నెం 205 :ఆడు మగాడు కవిత నెం : 205 అంతర్జాతీయ మగవారి దినోత్సవం సంధర్భంగా  ******************************************** ((((((((((ఆడు మగాడు ))))))) ________________… Read More
  • కవిత నెం 190:పేగుబంధానికి విలువెక్కడ ? కవిత నెం :190 పేగుబంధానికి విలువెక్కడ ? అమ్మా నాకు చిన్న నలతగా ఉంటే  నువ్వు కలత చెంది ,కన్నీళ్లు పెట్టుకునేదానివి  అమ్మా నేను అడగకుండానే… Read More
  • కవిత నెం 204:నేటి చుట్టరికాలు కవిత నెం :204 **నేటి చుట్టరికాలు ** పేరుకి ఉంటుంది రక్త సంబంధం  కాని మనసులకి ఉండదు ఏ సంబంధం  కలిసి యుండలేరు  కలిసినా మనస్పూర్తిగా మ… Read More
  • కవిత నెం 193:సమాజపు పోకడ కవిత నెం : 193 *సమాజపు పోకడ * నమస్కారానికి ప్రతి నమస్కారం - అది సంస్కారం  ఆ నమస్కారాన్ని పాటిస్తున్నదెవరు ? అదే సంస్కారం అని గుర్తిస్తున్నదెవ… Read More

0 comments:

Post a Comment