Monday, 13 April 2015

కవిత నెం136:ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్ ''


కవిత నెం : 136

*ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్  '' *
రచన : 13, హైదరాబాద్


ప్రియా నీవు లేక గడిచిపోయింది క్షణం
ఆ క్షణం క్యాలెండరు నే తిప్పేసింది
ఆ క్యాలెండరు కాస్త సంవత్సరం అయ్యింది
ఎలాగా నీవున్నావు ?
ఏం చేస్తుంటావు అని
నా మనసు పదే పదే ప్రశ్నలే వేసింది
కాని  సమాధానం సాయంత్రానికి నిద్దురపోతోంది కాని
నీ గురించి నాకేమి ముచ్చట నివ్వకుంది
గడియ   గడియకి నా గుండె వేగం పెరిగింది
గడియారం మాత్రం అలా నడుస్తూనే ఉంది
గడిచిన జ్ఞాపకాలను ఒక నిఘంటువు లా మారుతుంది
గడువబోయే కాలాన్ని నిర్దేశించలేక పోతోంది
గువ్వలన్నా నీ  గూడు చేరి
నా సమాచారాన్ని చేరవేస్తాయోమో అనుకుంటే
పోరా పనిచూసుకోరా అంటూ
పోడిముక్కులతో నన్ను ఎద్దేవా చేయసాగాయి
ఇక emiti  నాకు  దిక్కు అని దిగులుపడుతుంటే
అది నా హక్కును గుర్తుచేసింది
ఆ హక్కు ఏమిటో తెలుసా ?
ఇదిగో ilaa  పిచ్చిరాతలు రాసుకోవటం
పొద్దున్నే నుంచి సాయంత్రం వరకూ
ఒక రోజు ఎలా గడుస్తుంది అంటే
ఈ రోజుకైనా నీ కబురు వస్తుందా
మరో రోజుకైనా నీ జవాబు వస్తుందా
అంటూ ఆలోచన ఒక నావలా సాగుతుంది
ఆ రోజులన్నీ నెలలుగా
ఆ నెలలు అన్నీ సంవత్సరం గా మారి పోయింది
మరో కొత్త సంవత్సరం పుట్టింది
మరి నా మతి ఏమైపోయింది
చలించని గుండెరాయిలా చేసి
ఒక గూడ్సు బండిలో దాన్ని పడేసి 
ఆ నూతన సంవత్సరం లోకి మోసుకొచ్చింది 
మరుగుతున్న నా రక్త ప్రవాహం 
నీరు గారుతున్న నా అశ్రు భాష్పం 
జీవం లేని రూపం లా నా శరీరం
అలాగే నిద్దురపోతూ నా పయనం 
ఈ నూతన సంవత్సరం లోనైనా 
నీ నీరాజనం కోసం 
నిరీక్షణను కొనసాగిస్తూ 
ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్''

!!!!!!!!!!!!!!!

Related Posts:

  • కవిత నెం 80(మరణం) కవిత నెం :80 నేడు సంభవిస్తున్న మరణాలను చూసి  మనసు వేదన చెంది మరణాన్ని ప్రశ్నిస్తున్న వేళ నా ఈ ''మరణం '' పై కవిత  //////మరణం ////////// మర… Read More
  • హోళీ (కవిత నెం 348)వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక "హోళీ"సప్త వర్ణాల సొగసులతో సలక్షణమైన పండుగ "హోళీ"చలికి వీడ్కోలు పలికి , హోళికా దహన కాంతులే "హోళీ"రాధా కృషుల ప్రేమ గీత… Read More
  • కవిత నెం271: ఇదే జీవితం ... !! కవిత నెం :271 శీర్షిక పేరు : ఇదే జీవితం ... !! ఏది సత్యం ఏది నిత్యం ఏది కృత్యం ఏది నృత్యం ఏది భావం ఏది జాలం ఏది రాగం ఏది త్యాగం ఏది పైత్యం ఏది ద… Read More
  • @@@@అడుగడుగునా అనుబంధాల మూటలుఆత్మీయత , అభిమానాల గొడవలుకమ్ముకొస్తున్న కపట ప్రేమ సువాసనదూరమవుతున్న బందాల అన్వేషనదగ్గరగా ఉన్న , పరిచయాలే పక్కన… Read More
  • నువ్వు యాదికొస్తేనువ్వెక్కడున్నా ఓ వెన్నెలలానేను నీ వైపే చూస్తుండే నేలలాతనివితీరని నీ రూపం అపురూపమై నా హృదిలో దాగుంది దప్పిక తీరని ప్రేమ దాహమేదోనీ ప్రేమ ప్రవ… Read More

0 comments:

Post a Comment