Saturday, 11 April 2015

కవిత నెం 121:ఆడవారు

కవిత నెం :121 //ఆడవారు//

ఆడవారు అందంగా ఉంటారు.
పొగరుగా ఉంటారు,వగరుగా ఉంటారు 
స్వీట్ గా ఉంటారు ,హాట్ గా ఉంటారు.
అమితానందం చూపుతారు కాసేపు 
కారాలు మిరియాలు చూపుతారు కాసేపు 
బుజ్జగింపు కాసేపు 
బొందబెత్తుడు కాసేపు 
తెలివిగలవారు లేడీసు 
పదునుగలవారు లేడీసు 
కైపెక్కించే చూపు ఉంటుంది 
కాళికా దేవి రూపం ఉంటుంది 
భూదేవి సహనం ఉంటుంది 
గరుత్మంతుని గర్వముంటుంది 
నిదానముగా నడుస్తారు 
ఫ్యాషన్ షో క్యాట్  వాక్ చేస్తారు 
దొంగచూపులలో దింపుతారు 
ముక్కుసూటిగా వెళ్తే ప్లేట్ పిరాయిస్తారు 
కమ్మని ఊసులెన్నో చెప్తారు 
కాఫీ లాంటి డేస్ మనకే ఇస్తారు 
చెంప చెల్లుమనిపిస్తారు 
నీ చెంతనే ఉంటూ మంచి స్నేహమిస్తారు 
షేరింగ్ ఇస్తారు సింగిల్ హృదయం నీకే అంటారు 
మంచి కేరింగ్ తో నీ మదిని కొల్లగోడతారు 
మంచి సంప్రదాయముంటుంది వారిలో 
మధుర  చమత్కారముంటుంది వారిలో 
గడసరి సొగసులు కురిపిస్తారు 
దాగుడు మూతలు ఆడుతారు 
గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు 
కాని ఎవ్వరి స్థానాన్ని వారి మనసులో చెరుగ నీయరు
మాటలెన్నో చెప్తారు 
అర్ధా లెన్నో  తీస్తారు 
కాని వారి భావాల కారణం  తెలియనీయరు 
ప్రతి మగవానికి తోడు ఆడదిరా 
ప్రతి మగవాని వెనుక ఆడదిరా 
చరిత్రకు మూలం ఆడదిరా 
ఆమెలేని చోటు  ఏడ ఉందిరా

ఆడావారికి గౌరవం - మన సృష్టి గర్వ కారణం

!!!!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా





Related Posts:

  • మినీ కధ 1 :ఎలుకమ్మ ర్యాగింగ్ మినీ కధ  ** ఎలుకమ్మ ర్యాగింగ్ *** మా ఇంటి అలమరలో ఉంది ఒక ఎలుక  ఎప్పటి నుంచో వేసింది పాగ  దొరకకుండా తిరుగుతుంటాది బాగా  ఓ అల్లరి … Read More
  • కవిత నెం 235 :నీతోనే ఉంటా నమ్మవా కవిత నెం  :235  * నీతోనే ఉంటా నమ్మవా * నా నిద్రతో నీవు నిదురిస్తున్నావా చెలీ అందుకే నాకు నిద్రలేని ఈ రేయి నా కనురెప్పపై కొలువున్నావా చెలీ … Read More
  • కవిత నెం 236:ప్రేమంటే నా మాట లో కవిత నెం : 236 * ప్రేమంటే నా మాట లో * ప్రేమంటే నిన్ను కోరుకోవటం  కాదు ప్రేమంటే నీ మనసుని కోరుకోవటం ప్రేమంటే నిన్ను వేధించటం కాదు ప్రేమంటే నిన… Read More
  • కవిత నెం 230 :కన్నీరు కవిత నెం : 230 ''కన్నీరు '' కంటి నుండి వచ్చును 'కన్నీరు'  మనసు చెమ్మగిల్లితే ఆ భాదే నీరు  ఉప్పొంగే దుః ఖమే 'కన్నీరు ' ఉప్పెనగా మారితే అద… Read More
  • కవిత నెం 233 :చదువుల బరువులు కవిత నెం  :233 *** చదువుల బరువులు **** చిట్టి చిట్టి చేతులకి బారెడు బాధ్యతలు  బుడి బుడి నడకలకి ఈడ్చలేని బ్యాగుల మోతలు  ఏం న… Read More

0 comments:

Post a Comment