Saturday 11 April 2015

కవిత నెం 108:భయం

కవిత నెం :108

ఎక్కడ నుంచి వస్తుందీ ?
ఎటువైపునుంచి వస్తుందీ ?

చల్లని స్పర్సలా వచ్చి 
పాదరసంలా ఒళ్ళంతా పాకి 
కరెంటు షాక్ లా నరనర మెక్కి 
మనకు తిమ్మిరి పుట్టిస్తూ ,అది పుడుతుంది 
తను పుట్టేంతవరకూ తన సంకేతాలు 
మనలో కలుగచేస్తుంది 
తను వచ్చాక తన సంగతేమిటో 
మనకు తెలియచేస్తుంది 

నెమ్మదిగా మొదలై 
ఉన్నపాటుగా మన గుండెను తాకి 
ఉలిక్కిపాటును మనలో రేపి 
మన రక్తనాళాలలో వేడిని పుట్టించి 
తట్టుకోలేని సునామీ అంత వేగంగా 
మన శరీరంలో కంపనం పుట్టించే రైలు శబ్దంలా 
దడ దడ తన దండోరా ను ఒక్కసారిగా 
మనపై చూపిస్తుంది 
అదే భయం భయం భయం 


!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

0 comments:

Post a Comment