Wednesday, 20 December 2017

314(కన్నప్రేమ)

కవిత నెం :314 *కన్నప్రేమ * కొడకా ఓ ముద్దు కొడకా కొడకా ఓ కన్న కొడకా కొడకా ఓ తల్లి కొడకా ఏందిరయ్యా నీ పొలికేక మారింది నీ నడక మా గతి ఏడ చెప్పలేక నువ్వంటే ఇష్టం కనుక గత్యంతరం మాకు లే...

కవిత నెం :313(తెలుగునేడు )

కవిత నెం :313 *తెలుగునేడు * కవి అన్నా , కవిత్వమన్నా తెలియదు ఒకప్పుడు కవులు ,కవీశ్వరులు కోకొల్లలు ఇప్పుడు రాజుల కాలం నాడు మాత్రమే ఉన్న గుర్తింపు రాను రాను కరువవుతుంది రాణింపు తెలుగు పండితులంటే చులకన ఒకప్పుడు తెలుగుభాషతో హేళన ఇప్పుడు పరభాషలపై మోజు ,వ్యామోహం ఇప్పుడు తెలుగు మాట్లాడటం నేరంగా పరిగణన తెలుగోడిగా నువ్వెందుకు చెయ్యవు పరిశీలన ? కవులు /కవిత్వాలంటే అపహాస్యం సభలు /సమావేశాలంటే పెరుగుతుంది జోక్యం బిరుదులు /సన్మానాలు అంటే మనకెంతో ఇష్టం తెలుగంటే బేఖాతరు అది వృద్ధి చెందుట కష్టం పండితులు ,నిపుణులు ఎందరో మహనీయులు వారి వచనాలు వినకుండా పెడచెవిన పెట్టేరు మన...

Sunday, 17 December 2017

కవిత నెం :312(ప్రపంచ తెలుగు మహాసభలు)

కవిత నెం :312 * ప్రపంచ తెలుగు మహాసభలు * అత్యంత రంగ వైభవంగా ప్రతీ ఇంట కవుల సంబురంగా తెలంగాణా తెలుగు వెలుగులు అంబరంగా అందరికీ ఉత్తర్వ / రిజిష్టర్ ఆహ్వానాలు సుదూర ప్రాంతాల నుంచి చేరిన కవికిరణాలు ఎందరో కళాకారుల ప్రతిభకు ఇదొక ఆనవాళ్లు హైదరాబాద్ నడిబొడ్డున తెలుగు శోభితాలు తలచిన కార్యం ఒక మహా సాహితీ ప్రభంజనం ఎందరో కవుల /కళాకారుల హృదయాల పులకరింత ఎందరో ప్రేక్షకుల నయనాలు  పరవశింత ఆత్మీయం ,ఆతిధ్యం హత్తుకొంటూ ఆకాశపందిరి , హరివిల్లు ఒకటిగా కలుసుకుంటూ పొందివచ్చిన అవకాశం అందిన ద్రాక్షగా అందకుండా జారిన అవకాశం ఒక ఆశగా అతిదులందరున్నా , సమావేశాలు ఎన్నున్నా ప్రాచుర్యం...

Tuesday, 12 December 2017

కవిత నెం :311(మన పల్లెసీమ)

కవిత నెం :311 మన పల్లెసీమ ప్రకృతితో దర్శనమిచ్చేది బద్దకాన్ని వదిలించేది ఆరోగ్యాన్ని ప్రసాదించేది ''మన పల్లె సీమ '' అందాలతో విందుచేసేది ఆమని సొగసులనందించేది ఆడపడుచుల అనురాగమది ''మన పల్లెసీమ '' చిన్నా పెద్దా బేధం లేనిది చీకు చింత చూపకుంటది ఆటలు -పాటలు కలుపుకుంటది ''మన పల్లెసీమ '' పేదా ధనిక పొంతలేనిది పాడిపంటల భాగ్యమున్నది రైతుకు మిక్కిలి ఊపిరైనది ''మన పల్లెసీమ '' అందరికీ బందువైనది ప్రతీ బంధం విలువైనది ప్రేమకు పెన్నిధిగా ఉన్నది ''మన పల్లెసీమ '' మానవత్వం జాడ ఉన్నది మనిషిగా నిన్ను కన్నది మమతల సమతల తోడుకలది ''మన పల్లె సీమ '' సద్దన్నం బలము...

Monday, 20 November 2017

కవిత నెం :310(జీవన మంత్రం)

కవిత నెం :310 *జీవన మంత్రం * కోపమొస్తే సహించు మౌనమొస్తే వహించు భాదవస్తే భరించు భాద్యతగా ప్రవర్తించు కష్టమొస్తే కృషించు సుఖాలను అనుభవించు కన్నీళ్లొస్తే విలపించు ఆనందమైతే హర్షించు మంచిని ప్రోత్సహించు చెడుని వ్యతిరేకించు ప్రేమను చూపించు బంధాలను బ్రతికించు ధైర్యాన్ని ప్రదర్శించు భయాన్ని విస్మరించు స్నేహాన్ని వ్యక్తపరుచు అహాన్ని విసర్జించు పెద్దలను గౌరవించు పిల్లలను ప్రేమించు క్రమశిక్షణ పాటించు అన్వేషణ కొనసాగించు విషయాన్ని వివరించు సలహాన్ని  సూచించు దైవాన్ని ఆరాధించు నీ దేశాన్ని కీర్తించు ప్రశ్నని సందించు జవాబు కోసం ప్రతీక్షించు సమయపాలన...

కవిత నెం :309( అక్షర సత్యాలు)

కవిత నెం :309 అక్షర సత్యాలు పంతాలు -పైత్యాలు కోపాలు -తాపాలు పుణ్యాలు -పాపాలు అవి మనిషన్నవానికి మామూలు కష్టాలు -కన్నీళ్లు వస్తే తట్టుకోలేరు సుఖాలు -సంతోషాలు ఎదుటివారిలో చూడలేరు అహాలు -ఆవేశాలు అవి మనకు అక్కర్లేదు కుళ్లు -కుతంత్రాలు నీవు చేయనక్కర్లేదు హక్కులు -అర్హతలు అవి అందరికోర్కెలు ఇచ్చుకోలు -పుచ్చుకోలు అందులో మంచి ఉంటే చాలు అవునన్నా -కాదన్నా ఇవి అక్షర సత్యాలు - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు&nbs...

Thursday, 19 October 2017

కవిత నెం :308 (పట్నపు సోయగం)

కవిత నెం :308 * పట్నపు సోయగం * ఇరుకిరుకు నగరాలు వెనకెనుక బంగ్లాలు అగ్గిపెట్టె మేడలు మురికివాడల బ్రతుకులు ప్రతీ ఇంట మురుగు కంపులు కాలుష్యపు కిరణాలు పొగచిచ్చు వాహనాలు దుమ్ము-దూళితో కూడే రోడ్లు అడుగడుగునా ట్రాఫిక్ సిగ్నల్లు ఎవరికెవరు ఏమీ పట్టదు ఏ బంధమూ ఆగమనీ చెప్పదు ఉరుకూ-పరుగుల జీవితాలు మంచీ చెడూ ఉండనీ పలుకులు ప్రతీ క్షణమూ చిత్రము ప్రతీ సెకనూ పైకము ప్రేమలేని తత్వాలు మనసు లేని మనుషులు పండుగకు ,పబ్బాలకు తీనుమారులే ప్రతీ ఇంటా చందాల దందాలులే నీకున్న అవసరం వారికి ఆసరా ఏ చిన్న సాయం దొరకదూ ఇక్కడ గాలి వానలకు ఎగిరే విధ్యుత్తు నీరుగాన...

కవిత నెం : 307(వెధవ జీవితం)

కవిత నెం : 307 * వెధవ జీవితం * చిన్నప్పుడే హాయిగా ఉంది కష్టం తెలియదు తెలిసినా చేయనిచ్చేవాళ్లు లేరు సుఖం తెలియదు అందులోనుంచి రానించేవాళ్లు లేరు దుఃఖం తెలుసు కానీ బుజ్జగించేవాళ్లు మనసారా నవ్వేవాళ్లం మన నవ్వుకోసం ఎన్నో ఎదురుచూపులు తెలియనితనం ,తుంటరితనం అమాయకత్వం ,అంతులేని పంతం కులమంటే తెలియదు కలసిమెలసి ఉండేవాళ్లం ఒకరితో ముద్దలు తినిపించుకునేవాళ్లం ఏ వాకిలి అయినా ఒకటే మనకు మన ఇంటికి రావటమే మరచే వాళ్లం ఆకలేస్తే ఏ చేయి అయినా అన్నం పెట్టేది దాహమేస్తే ఏ గుమ్మమైనా సేదతీర్చేది నిద్రకు నేల -మంచం తేడా తెలియదు అలసటకు హాయి - రేయి ఉండదు పక్కవాడిది లాక్కునే...

Wednesday, 18 October 2017

కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు)

కవిత నెం :306 * ప్రేమ సంకెళ్లు * ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంది ఒక పక్క మనసు కృంగదీస్తున్నా మౌనంగా నవ్వుతుంది కన్నవారి కలల కోసం వీరి సౌధాల్ని చెరిపేసుకుంటుంది ఆత్మబలంతో ముందుకుపోతూ అంతరంగాన్ని అద్దంలో చూసుకుంటుంది ప్రేమ పేరుతో అవసరాలు ,వంచనలు ,వాంఛలు తీర్చుకునే వారున్నా నిజాయితీగా శారీరక సుఖానికి లోబడక ,ఆరాధనతో ఎదురుచూస్తుంది ఎక్కడున్నా ,ఎలాగున్నా -తన వారు పక్కనున్నా ,లేకున్నా తన జీవితం తన చేతుల్లో లేకున్నా సమస్తం తన హృదయమే విడిపోయి వరాన్ని పొందినా -వేధింపులు...

కవిత నెం : 305(అత్యుత్సాహ అరంగేట్రం)

కవిత నెం : 305 * అత్యుత్సాహ అరంగేట్రం * మీ గురించి మీరు ఆలోచించుకోండి పక్కనోడి శ్రద్ధతో ఆరోగ్యం పాడుచేసుకోకండి తరాలు మారినా మన తలరాతలు ఇంతేనా ప్రేమ మంచిదే అతిప్రేమ చూపకండి గౌరవం ఇవ్వాలనుకుంటే అగౌరవపరచకండి పొగడాలనుకుంటే దొంగ పొగడ్తలు చేయకండి మీపై శ్రద్ధ చూపే వారిని నిర్లక్ష్యం చేయకండి ఎన్నో కలలు కనుంటాం చిన్నప్పటి నుంచి మనకు జరగనిదో ఒకరికి లభిస్తుందేమో కుదిరితే ప్రోత్సహించండి లేదా నిశ్శబ్దం పెను ప్రమాదమేమీ కాదు మన చెడు పైత్యాన్ని నిగ్రహించుకోగలిగితే నీవు పోటుగాడివి కావచ్చు అన్నన్నా నీ ముందు అందరూ తక్కువనే చులకనా ! మనం ఒక సమాజంలో ఉన్నాం మనమంటేనో...

Thursday, 12 October 2017

కవిత నెం :304(అమ్మ -విలువ)

*అమ్మ -విలువ * కవిత నెం :304 నువ్వెంత ఎదిగినా 'నాన్నా ' అనే ఓ పిలుపు నువ్వెంత తిట్టినా మరుక్షణమే కదా లాలింపు నీ జీవితం కోసం ఆమె సాంగత్యం నీకు మరుపు తన జీవితభారం నీకు తెలియదు అది కొసమెరుపు అమృతం రుచి చూసుంటావా ఓ బాపూ అమ్మ పాలు తాగావే ఏమంటావు చెప్పు వెళతావు కనపడని దేవుళ్ల గుళ్ల వైపు కనిపెంచిన దేవతవైపు ఉందా నీ చూపు ఆహర్నిశలు ఆమె శ్రమ నీకు చిన్న చూపు ఆస్తులకోసం ఆమె పంపక భారాన్ని ఇక ఆపు దెబ్బ తగిలితే గుర్తొచ్చేదే అమ్మా అనే పిలుపు తల్లి మనసు నొప్పిస్తుందని గమనించావా చెప్పు కష్టమొస్తే తట్టుకోలేని మనసు కదా నీది నీ సుఖం కోసం ,ఎంత కష్టమైనా భరించే...

Sunday, 1 October 2017

కవిత నెం :303 (జన్మ రహస్యం)

కవిత నెం :303 * జన్మ రహస్యం * సంబరమా అంబరమా శాస్త్రీయత్వమా అస్థిత్వమా నాగరికమా అనాగరికమా ఖర్మమా మర్మమా లోక యుక్తమా లోక కళ్యాణమా ఎందుకు జననం ఎందుకు మరణం జనన మరణాల నడుమ నలిగేదే జీవనం విదితమా విధిరాతమా సంకల్పితమా ప్రేరేపితమా తెలియని ప్రశ్నలు కొన్నైతే మదిని తొలిచేస్తున్న ప్రశ్నలు  ఎన్నో వత్సరానికి ఒకసారి వేడుకనా ఆయుష్షుకు దగ్గరని విచారణకా ఈ మధ్యస్థమైన ఆలోచన తటస్థమేనా నిర్మలత్వంలోనుంచి పుట్టిన నిజమేనా సాధన చేయుట కొరకా సాధ్యము అనిపించుట కొరకా అండపిండ  బ్రహ్మాండాలను ఛేదించుట కొరకా పుట్టుక ఒక అండ రూపమైన గిట్టుక పిండ ప్రధానమేగా అర్థమా...

కవిత నెం :302(మాతృత్వపు ధార)

కవిత నెం :302 *మాతృత్వపు ధార * తాను తల్లి కాబోతున్న అనే వార్త వినగానే తన్మయత్వంతో పులకించిపోతుంది ఆ తల్లి హృదయం ఎన్నో ఆశలు కళ్లలో దాచుకుని ఎన్నో ఊసులు తన పొత్తిలితో పంచుకుంటూ అనుక్షణం అనురాగసరాగాలతో ఆనంద విహారాలలో తేలియాడుతుంటుంది  తన బిడ్డ ఏమి చేస్తుందో అనుకుంటూ తన బిడ్డకోసం తననితాను మార్చుకుంటూ లోలోపల భాదని దాచుకుంటూ పైపైకి మురిపెంగా మురిసిపోతూ నిద్రలో కూడా తన ధ్యాస మారనీయకుండా తన బిడ్డకు జోల పాడుకుంటూ తనకు కునుకు వాలుతున్నా లోపలి బిడ్డకు అలికిడి తెలీనీకుండా కమ్మని హాయిని అందిస్తుంది అందరి దేవుళ్లను వేడుకుంటూ కొత్త అలవాట్లను అందుకుంటూ ఆనందసంబరాలతో...

Tuesday, 12 September 2017

కవిత నెం : 301// ప్రేమ యాన్ //

కవిత నెం : 302 // ప్రేమ యాన్ // నీ వడి వడి పలుకులు నాలో జడి రేపేనే నా మడి గిడి అంతా సడి ఆయేనే నా మదిలో ఏదో అలజడిగా మెదిలి నా గుండెలో గుడిగా నీకై  వెలిసినే నిన్ను చూసి నా కనులకు అదృష్టమే నిన్ను తలచి నా స్వప్నం అదృశ్యమే ఏవేవో మంత్రాలు నాకు వినిపించెనే నీ పేరు లాగే అవి గాంచెనే నన్నే నేను మై మరచానే నిన్నే ఎదలో ధ్యానించానే నీ చేతిలో శిలలాగ   అగుపించానే నీ స్పర్శతో నూతనంగా ఉదయించానే నీ ముద్దుతోటి మరల జన్మించానే నీ ప్రేమతోటి నేను పులకించానే నన్ను నే మరచానే నిన్నే ధ్యానించానే నా ప్రేయసి నాకై దిగివచ్చావే నా రాక్షసి నీకై తిరిగొచ్చానే - గరిమెళ్ళ...

కవిత నెం :300//భగ్న ప్రేమ //

కవిత నెం :300 //భగ్న ప్రేమ // నిలుచున్నా నీ నీడల్లో నీకోసం నిలుచున్నా నీ తలపుల్లో నీ కోసం మబ్బులలో విహరిస్తున్నా నా జాబిలి కోసం నీరులా ప్రవహిస్తున్నా నీ ఒడి కోసం నాలో నేనే అన్వేషణ - నీకై నీకై ఆరాధన నీ ప్రేమ చిగురు పొందితే చాలదా నీ   పెదవంచున   పేరులా మారితే చాలదా ఓ ప్రియా తపిస్తున్నా ఆ దేవుణ్ణే నీ కోసం పూజిస్తున్నా ఆ రాధనే నా దేవి కోసం బ్రతికేస్తున్నా నిర్జీవమై నీ ప్రేమ  కోసం భరిస్తున్నా ఈ జన్మనే నీ ప్రేమ కోసం - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు ...

Wednesday, 6 September 2017

కవిత నెం : 299 (జీవం -నిర్జీవం)

కవిత నెం : 299 * జీవం -నిర్జీవం * ఒకవైపు ఆనందం ఆకాశం వైపు మరోవైపు విషాదం ఆందోళన వైపు కనులముందు కాంతులే వెదజల్లుతున్న అంధకారం ఆ కాంతి ఛాయలనే కాటేసునా సాధించానని విజయం ఒకవైపు నీ విజయం పరాజయమని వెక్కిరింపు మరోవైపు ఒక్కమాట నీ మనసుకి హాయినిస్తున్నా కోఠి ప్రశ్నలు నా బుర్రను నలిపేసునా బంధాలకు దూరమయి గుండెరాయైనా ఏదో భారం ఎదలో అణుభారమై అన్వేషణ సంతోషాల సంబరాల కోసం ఏదో సమాలోచన సంబంధం లేని విషయమేదో దాడిచేసునా ప్రశాంతంగా ఉన్న మదిలో ఎదో పెను ఉప్పెన కూసింత క్షణం కోసం గడియారం ప్రకంపన అంతంలేని ఆవేశ , అనాలోచిత క్రియలు ఒక ప్రక్రియగా సాగక ,నడయాడే జీవన క్రియలు -...

Tuesday, 29 August 2017

కవిత నెం : 298(కోరిక)

కవిత నెం : 298 * కోరిక * మొగ్గలా మొలుస్తుంది పువ్వులా విచ్చుకుంటుంది ఆశలా పుడుతుంది గమ్యం కోసం పరిగెడుతుంది గుండెలోతుల్లో దిగులుగా , మెదడు మలుపుల్లో నరంలా ఆలోచనల వేడితో ముందుకు సాగిపోతుంటుంది శూన్యంలోనుంచి గగనతలం చేరేదాకా లోలోపల కొత్త ఉత్ప్రేరకాలను చేర్చుతూ వస్తుంది కనిపించనిదేదో మన కళ్ళముందుకు తెచ్చేదాకా కకావికలమవుతూ అలజడి రేపి అదృశ్యమవుతూ ఉంటుంది నీ సంకల్పం ఏమిటో దిశా ,నిర్ధేశం నీకు తెలిస్తే దానికై నిరంతరం నీ శ్రమ విద్యుత్తులా ప్రవహిస్తే నీవు కన్న కల , నీ నిజమైన కోరిక రూపంలో నీ ముందు నిజంలా నిలుస్తుంది అదే కోరిక గుఱ్ఱమై పరిగెడితే అది మితి మీరు...

Monday, 14 August 2017

కవిత నెం : 297 (మన స్వాతంత్రం)

కవిత నెం : 297 *మన స్వాతంత్రం * తరాలు మారినా ,యుగాలు మారినా ఓ భావి భారత పౌరుల్లారా మన దేశంపై పొరుగు దేశాల దండయాత్రలు ఇంకా పుంకాలు పుంకాలుగా మనమేమో స్వాతంత్రం అంటే మన ముందు తరాలు వారు తెచ్చిపెట్టారు మన స్వేచ్ఛ అంటూ ,ఏదో మచ్చ అంటూ బద్దకంగా బ్రతికే మూగ జీవుల్లారా లేవండి మన ఇంట్లో వారితోనో మన పక్కింట్లో వారితోనో మన కులం కాదనో మన మతం కాదనో నీకెక్కడో అహం అడ్డువచ్చిందనో నీకేదో అవమానం జరిగిపోయిందనో రగులుతూ ,నిప్పులు రాచుకుంటూ చావకు మన దేశంలో పుట్టిన వారు ఎందరో పొట్టకూటి కోసం పొరుగుదేశం పోయి పడే అవస్థలు గుర్తుతెచ్చుకో భగ భగ మండే వారి హృదయాల ఆవేదన...

Tuesday, 4 July 2017

కవిత నెం :296(* ఎందుకు గాబరా *)

కవిత నెం :296 * ఎందుకు గాబరా * ఒకరికోసం నీ గమ్యం ఆగకూడదు ఒకరికోసం నీ మార్గం నిర్దేశింపబడకూడదు ఎవరు  నువ్వో ఈ భూమిపైకి రాకముందు ఎవరు నువ్వు అనేది నువ్వు నిరూపించుకోవాలి ఒక అవకాశం నీకై ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటుంది అనవసరంగా నీ లక్ష్యాన్ని గందరగోళంలో ఉంచకు ఆట అంటే ఆడతాము ,ఓడతాము ,తిరిగి గెలుస్తాము జీవితం అనే ఆటలో ఎప్పుడూ గెలవాలని కోరుకో ప్రతీ విషయానికి క్షుణ్ణంగా వెళ్లి మనసు పాడు చేసుకోకు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ కార్యదీక్షుడవు కమ్ము నీ వంతు కృషిని ఎప్పుడూ అసమాలోచన చెయ్యకు నీతి ,నిబద్ధతలతో నీ గమ్యాన్ని సరాళం చేసుకో ఏదో ఒక కార్యం...

Tuesday, 6 June 2017

కవిత నెం : 295(దిక్సూచి)

కవిత నెం : 295 *దిక్సూచి * కసిగా ఉండాలి మసి తొలగించాలి పట్టుదలతో నువ్వే విజయం పొందాలి క్రమశిక్షణ ఉండాలి విద్యార్థిగా మెలగాలి నీ ఓర్పుతో ఉన్నతంగా ఎదగాలి భవిత మీదే ఈ కవిత నాదే శ్రమలో పుడితే  గెలుపు మీదే రేపటి సూర్యులు మీరు నేటి సమిధలు మీరు ఎదిగే మొక్కలు మీరు నేటి విత్తులు మీరు నీ లక్ష్యాన్ని ఎంచుకో నీ లక్షణాన్ని తెలుసుకో నీ గమ్యాన్ని మలుచుకో గగన విహంగమై దూసుకుపో భవిత మీదే ఈ కవిత నాదే గతము చూస్తే గుబులు రాదే ఆశల సౌథం మీరు రేపటి ఆశాకిరణం మీరు అక్షర ద్వీపం మీరు రేపటి అక్షర ఆయుధాలు మీరు నీ ఆశయం నిలుపుకో నీ అభివృద్ధిని నిర్మించుకో నీ గమనాన్ని...

Thursday, 1 June 2017

కవిత నెం : 294(వయ్యారిభామ)

కవిత నెం : 294 *వయ్యారిభామ  * ఎందుకు వస్తావు ఎందుకు వెళ్తావు నా మనసుని గిల్లుతావు గిల్లి లొల్లి పుట్టిస్తావు ఇంతలో మళ్లీ కానరావు పెదవిపై నవ్వు కాయగానే ఎదలో భాదవై గుచ్చుతావు నవ్వుతూ ఎదురొస్తావు వలపుల వాలిపోతావు నా తలపులోంచి జారుకుంటావు తుమ్మెదలా తిరుగుతుంటావు నా చుట్టూ చేరి అల్లరిచేస్తావు అమాంతంగా ఎగిరిపోతావు నిన్ను చూసే కనులకు వెలుగైతావు చీకటి తెరలను చెదుర్చుతావు నిప్పు కణికలా వాతపెడతావు నీ స్నేహంలో విహరించగలను నీ విరహం నేను భరించలేను నీ ప్రేమకు దాసుడను నేను నా అపురూప సుందరి నీవు నా ప్రేయసి నీవు - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద...

Wednesday, 31 May 2017

కవిత నెం :293(మనిషి భాగవతం)

కవిత నెం :293 *మనిషి భాగవతం  * ఒకరికి తెలిసిందే ధర్మం మరొకరు అనుకునేదే న్యాయం ఇంకొకరు చెప్తారు వేదం మరొకరు చూపిస్తారు బేధం ఒకరికొరకే నీతి మరొకరు అది చేస్తే అవినీతి తాను పలికితే ఒప్పు మరొకరు చేస్తే అది తప్పు మంచికొరకు ముందుకొచ్చేది ఒకరు చెడు చెయ్యటమే పనిగా పెట్టుకుంటారు మరొకరు నువ్వు హేళనగా మాట్లాడవచ్చు ఎదుటివాడు నిన్ను అమర్యాదించకూడదు నీకు ఉండదు బుద్ది ఎదుటివారికి ఉండాలని తినమంటావ్ గడ్డి నువ్వు సంపాదించవచ్చు డబ్బు ఎదుటివాడు సంపాదిస్తుంటే నీ కొస్తుంది జబ్బు నువ్వు నోరు తెరిస్తే అబద్దం ఎదుటివాడు నిజాలు మాట్లాడినా అది నీకు అబద్దమే పొగడ్తలతో...

Monday, 29 May 2017

కవిత నెం :292(మనసు వాంచ)

కవిత నెం :292 *మనసు వాంచ * మనసారా ఉండాలనీ మనసు మాట పంచాలనీ మనసు కిటికీ తెరవాలనీ అనుకుంటూ చలిస్తుంది ఆ మనసు ప్రతి స్పందనకై ఎదురుచూస్తూ తేనెపూసే మాటలొద్దు తేనెలొలికే మాట చాలు మత్తు జల్లే మనసు వద్దు బాధపడినా నిజమే ముద్దు ముందరకాళ్ల బంధమొద్దు వెన్నుతట్టే హస్తమే హద్దు నీ నవ్వులో ఒక చూపు చాలు నీ నవ్వుతో ఒక పలకరింపు చాలు మనసంటూ ప్రతీ వారికి మనసంటూ ఒకటుంటుంది మనసుని నొప్పించకండి కుదిరితే మీ స్వచ్ఛనీయమైన స్నేహంతో మనసుని మెప్పించండి అదే అదే ఈ మనసు వాంఛ - గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్&nbs...

Wednesday, 24 May 2017

కవిత నెం :290(మారాలి)

కవిత నెం :290 మారాలి మారాలి ఈ ప్రపంచం మారాలి నువ్వూ మారాలి నేనూ మారాలి మనం మారాలి ఈ జనం మారాలి చూస్తూ ఉంటే రోజులు పోతాయి కూర్చుని తింటే కొండలు కరుగుతాయి మనకెందుకు అనుకుంటే మనల్ని కూడా వదిలించే రోజులు వస్తాయి ముందుకు కదిలితేనే అడుగు పడుతుంది వెనకకి తిరిగితే లక్ష్యం దూరమవుతుంది మారాలి మారాలి ఈ ప్రపంచం మారాలి ఎదో ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట మార్పు అనేది అవశ్యం మార్పు ఉండనిదే తత్వం మారదు మార్పు లేనిదే వ్యక్తిత్వం పుట్టదు మనం మారుతూనే ఉంటాం మన పరిసరాలు మారుతూనే ఉంటాయి కదిలే కాలంతో పాటు కదిలే మనుషులతో పాటు మనమూ మారకతప్పదు మనలో కొంతైనా మార్పు...

కవిత నెం :289(నవ్వంటే)

కవిత నెం :289 *నవ్వంటే * నవ్వంటే నాకిష్టం నవ్వుతూ ఉండాలన్నది నా మనోగతం నవ్వుతూ కనిపించే వాళ్లంటే ఒక సంతోషం నవ్వుతూ పలకరించే వాళ్లంటే ఒక గౌరవం మాట్లాడుతూ నవ్వు తిడుతూ నవ్వు నవ్వుతూ నవ్వు నవ్విస్తూ నవ్వు నవ్వెప్పుడూ ఆరోగ్యమే నవ్వెప్పుడూ ఒక మహా యోగమే మనస్ఫూర్తిగా నవ్వే నువ్వు నలుగురికి స్ఫూర్తి నువ్వు నవ్వుతో సమస్యలు మాయం నవ్వుకి ఈ జగమే అవుతుంది సలాం నవ్వంటే నా కిష్టం నాకు నవ్వాలనే ఉంటుంది ఎప్పుడూ నవ్వుకి నేను శత్రువును కాదు నవ్వలేని వాళ్లకు నేను జవాబు కాను -గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు&nbs...

కవిత నెం :288(నీ ప్రేమలో నా గమనం)

కవిత నెం :288 * నీ ప్రేమలో నా గమనం * నిన్ను చూస్తే నా కలం సాగుతుంది నిన్ను చూసాక నా కవిత పొంగుతుంది నీవున్న చోట ప్రేమ పరిమళిస్తుంది నీతో కలిసి నడిచే బాట లక్ష్యాన్ని చేర్చుతుంది నీ మాటల ముత్యాలతో నాలో నవ్వుల జల్లు కురుస్తుంది నీ సొగసుల వలపు ఆస్వాదించగా అమరత్వం సిద్ధిస్తుంది నీ కనుల బాస నేర్వగా నాలో జ్ఞానం ప్రకాశిస్తుంది నీ సాంగత్యం దక్కించుకున్న నేను అమరేంద్ర రాజేంద్రుడను నేను నీ ప్రేమ తత్వంతో ముగ్దుడనవుతున్న నేను భూలోకపు ఇంద్రుడను నేను నన్ను వలచిన ఈ దేవి దేవతగా వారాలనందిస్తుంటే నిన్ను పొందగా ఈ జన్మ నూతనత్వాన్ని వసగా పోసుకుంటుంది - గరిమెళ్ళ...

Saturday, 29 April 2017

కవిత నెం :287(తనే నా వసంతం)

కవిత నెం :287 *తనే నా వసంతం * నడుస్తూ రోజులు గడిచిపోతున్నాయి పరిగెడుతూ నెలలు మారిపోతున్నాయి నా అడుగులో అడుగై నాలో సగమై నా జీవితంలోకి అడుగుపెట్టి నేనే తన లోకమని భావించి తన గురించి తానే మర్చిపోతుంది ఈరోజు ఒక మంచిరోజు - నాకు పండుగ రోజు నా నెచ్చెలి ,నా ప్రాణం జన్మించిన రోజు నా అర్ధాంగిగా తన నాల్గవ పుట్టినరోజు  ************************************* తనతోనే సంతోషం తనతోనే సమస్తం తానే నా ప్రపంచం గొప్ప ఆలోచనలు తనవి నిర్మలంగా కనిపించే ముఖారవిందం తనది స్వచ్ఛంగా సాక్షాత్కరించే చిరునవ్వు ఆమెది అదృష్టాన్ని చూసి మోసపోదు కష్టాన్ని నిముషమైనా వదలదు పట్టుదలతో...

Sunday, 16 April 2017

కవిత నెం :286ఓ శివ మహా శివ)

కవిత నెం :286 ఓ శివ మహా శివ నీ శివాజ్ఞ ఎప్పుడయ్యా మా మీద నీ కృప దయచూపేదెప్పుడయ్యా ఓ శివ మహాశివ అందరి బంధువుడవు మా ఇంట నిలవలేవా ? మాకు కనుల పంట చేయగా రావా ? ఓ శివ మాహాశివ నుదుటి మీద రాత నీవా ఏ చీమ కదలాలన్నా కారణం నీవా మా కనుచూపు మాపై చూపవయ్యా ఓ శివ మహాశివా నీవుంటే చాలు అది మహా ప్రసాదం నీ స్మరణ అది మాకు సంతోషం నిన్ను పూజింప మేము ధన్యులం నందిని పంపుతావో నీ త్రిశూలాన్ని పంపుతావో విబూదివై మమ్ము తరిస్తావో తెలియదు రా కదలిరా రా నువ్వు రా ఏకైక కోరిక ...... నువ్వే లేచి రా శివానందాన్ని మాకు అందించగా రా...

Friday, 14 April 2017

కవిత నెం :285(శ్రీ సూర్య నారాయణుడు)

కవిత నెం :285 * శ్రీ సూర్య నారాయణుడు * సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసేవాడా - నీకు వందనం స్వయం ప్రకాశ తేజోమయరూపమా - నీకు వందనం సమస్త మానవాళికి జవజీవాలను ప్రసాదింపేవాడా - నీకు వందనం అదితి పుత్రుడా ! అగ్ని గర్భుడా  - నీకు వందనం స్థితికారకుడా ! దినకరుడా  -నీకు వందనం ప్రభాకరుడా ! భువనేశ్వరుడా - నీకు వందనం ప్రభాత ఉషోదయంతో మేల్కొలిపే భాస్కరుడా   - నీకు వందనం సర్వ దేవతలయందు మిళితమైనవాడా - నీకు వందనం సమస్తలోక జీవరాశికి జీవం కల్పించేవాడా - నీకు వందనం బంగారుకాంతితో ప్రకాశించేవాడా - నీకు వందనం ఏడు గుఱ్ఱాల రథంతో ఆకాశయానం చేయువాడా -...

కవిత నెం :284(నా గురించి నా విశ్లేషణ)

కవిత నెం :284 * నా గురించి నా విశ్లేషణ * ఆకాశమంత ఆనందం పాతాళంలోకి తరమాలని విషాదం నువ్వంటే నువ్వు కాదని చెప్పే కల్పితం నాలోన మరో కోణాన్ని చూపే వాస్తవం అందలం ఎక్కమని చెప్పే అహం పొరపాటు చెయ్యకుండా ఉంచే విచక్షణం అందరిలానే నాలో కూడా ఉద్రేకం అంతలోన కూడా నన్ను వదలని శాంతం ఎల్లప్పుడూ మేలును కోరుకునే నా హృదయం నా మంచి కోరుకుంటూ ఉండే మంచి స్నేహమా విషపు నీడలో  పొంచి ఉండే శత్రుత్వం కషాయాన్ని అయినా దిగమింగే  ఆత్మస్థైర్యం అంతా మన మంచికే అంటూ ఉండే మనోనేత్రం సుడిగాలుల మధ్య చిక్కినా చెదరని మనో సంకల్పం ఏమి జరిగినా ,ఎన్ని జరిగినా నన్ను అభిమానిస్తూ...

Thursday, 6 April 2017

కవిత నెం 283(నేటి చిన్న తనం)

కవిత నెం 283 * నేటి చిన్న తనం * వివేకమో ,అవివేకమో తెలియదు గర్వమో , గారాభమో తెలియదు  కదిలిస్తే చాలు నాగు పాము పాము బుసలు క్షణికంలో మారిపోయే మనసు తత్వాలు ఏ కాలంలోనైనా ,గతించిన కాలమే మేలు పెద్దలయందు ఒక గౌరవం ,భక్తి ఉండేవి కలికాలమహిమ ఏమో కాని .... కనువిప్పు కల్గదు నేటి జనాలకు కానీ అంధకారంలో కనులు మూసుకుని ఉంటాయి వెర్రి జాలం ఒకవైపు , అమాయకత్వం మరో వైపు తెలుసుకుని మసులుదామనే కించిత్ ప్రయత్నం లేదు అహం బ్రహ్మాస్మి అనే పొగరు పూసిన చిగురు నేనే కదా అంటూ సాగే నేటి కధలు ఎన్నెన్నో నేనుంటే చాలుకదా అనే నక్కవినయాలు మరెన్నో ఏమి వస్తుంది సుమీ మీకు ఎగిరెగిరి...

Tuesday, 4 April 2017

కవిత నెం : 282(శ్రీ రామ్ )

కవిత నెం : 282 *శ్రీ రామ్ * రామనామము రమనీయమైన కావ్యంరామనామజపం ముక్తికి మోక్షదాయకంమానవజాతికే ఆధర్సనీయం శ్రీరామజన్మంజయహో జయరామ పరందామ శ్రీరామ జయహే ! అందరికీ ''శ్రీ రామనవమి '' శుభాకాంక్షలు  శ్రీ రామ నిన్ను తలంచిన్ చాలు కష్టాలు లయమగున్ శ్రీ రామ నిన్ను పిలంచిన్ వెంటనే ఆ శ్రీమాన్ తోడుగావచ్చున్ శ్రీ రామ నీ పాదసేవ సకలలోకంబులకు మేలు కల్గించున్ శ్రీ రామ నీకృప మమ్ములను ఎల్లవేళలా కాచి కాపాడున్  ఓ శ్రీ రామ ఇది చాలు కదా మాకు నిన్ను ధ్యానించే భాగ్యమున్&nbs...

Thursday, 30 March 2017

కవిత సంఖ్య :281(జీవితమే ఒక ప్రశ్న)

కవిత సంఖ్య :281 జీవితమే ఒక ప్రశ్న ఏదో వెతుకులాట ఎక్కడికో  ప్రయాణమట ఎంత ఉన్నా ,ఏమి తిన్నా తృప్తి లేని మనిషి తన అవసరాలకు మించి పరితపిస్తుంటాడు భాదలు - బంధాలు కష్టాలు -సుఖాలు ఆరాటలు -పోరాటాలు సమస్యలు - ప్రశ్నలు గెలుపు -ఓటమిలు కోపాలు - ప్రేమలు ఆశ -నిరాశ తప్పు -ఒప్పులు కాలంతో పయనించే మానవ జీవితం అర్ధమవ్వని ఒక ప్రశ్నార్థకం నిరంతర గమనం నియమం లేని జీవి...

Tuesday, 28 March 2017

కవిత సంఖ్య : 280* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు *

కవిత సంఖ్య : 280 * హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు * మావి కొమ్మలు మల్లె రెమ్మలు కోయిలమ్మలు లేలేత చిగురులు వేప పువ్వులు చెఱుకు గడలు బంతి- చేమంతులు పుడమి తల్లి కాంతులు తొలకరి జల్లులు విరిసిన హరివిల్లు ముంగిట్లో రంగవల్లిలు అంబరాన మెరిసిన శోభలు కోవెల గంటలు రమణుల వంటలు షడ్రుచుల సమ్మేళనాలు వేద పఠనాలు పంచాగ శ్రవణాలు పర్వదిన సంబరాలు స్వాగతాలు స్వగతాలు నవ వసంతాలు కొత్త ఉత్సాహాలు పచ్చదనాలు ప్రకృతి రమణీయాలు మామిడి తోరణాలు ప్రతీ ఇంట ఉత్సావాలు ఈ 'ఉగాది 'ఉషోదయాలు శ్రీ హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు ...... - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద...

Sunday, 19 March 2017

కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !)

కవిత సంఖ్య :279 కవితా శీర్షిక : వస్తుంది ఉగాది ! తెలుగింటి ముంగిలి లోకి  ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది  స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అందివ్వటానికి  పిండి వంటల ఘుమ ఘుమలతో .. ఉవ్విళూరిస్తూ.. వస్తుంది ఉగాది   ఉరకలేసే సంతోషాల సంబరం తేవటానికి  కొత్త కొత్త అందాలను తనతో తెస్తూ వస్తుంది ఉగాదిఆమని సొగసులతో .. పగడాలను కూర్చటానికి  కమనీయమైన ఆలాపనతో వస్తుంది  ఉగాది కోయిలమ్మ పలుకులు వినిపించటానికి మురుస్తూ ,మెరుస్తూ వస్తుంది ఉగాది మామిడాకుల తోరణాలతో మది నింపటానికి పరిపూర్ణమైన పచ్చదనంతో వస్తుంది ఉగాది ప్రకృతితో...

Tuesday, 28 February 2017

కవిత నెం 278: అంతా మిధ్య

కవిత నెం :278 * అంతా మిధ్య * ఎక్కువగా ఏదీ కోరుకోకు  పొందినదాన్ని చేతులారా చేజార్చుకోకు  అంతా నీదేనని మిధ్యపడకు  ఇంతలో ఏముందని తేలికపడకు  సమస్తం తెలుసునని మిడిసిపడకు  అందరూ వెర్రివాళ్లు అని చులకనపడకు  సుఖంలో ఏదోఉందని సంబరపడకు  కష్టం బహుకఠినమని దిగులుపడకు  మెరిసేదే బంగారం అని తుళ్లిపడకు  మెరుపుకన్నా వేగం లేదని మభ్యపడకు  ...

Wednesday, 22 February 2017

కవిత నెం 277:*కారులో ...... *

కవిత నెం :277 *కారులో ...... * కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా నీకున్నది ఒక్కకారు చూసుకుంటూ మురిసేవు నాజూకుగా నడిపేవు నీ పక్కకి రాక దడిసేము నీ పక్కకి రాక దడిసేము కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా సందు సందులో నడిపేవు సైడు ఇవ్వకుండా పోతావు నీ కారు సైడుకి చిన్న గీతెడితే సీన్ చింతకాయ చేస్తావు సీను చింతకాయ చేస్తావు కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా ...

కవిత నెం276:తెలుగు వెలుగు

కవిత నెం :276 శీర్షిక పేరు :  తెలుగు వెలుగు  మరో జన్మకేగినా , మరల జన్మించినా మాతృభాష  తెలుగవ్వాలనీ విదేశాలకేగినా ,విచ్చలవిడి తిరిగినా తెలుగంటే  అంటు కారాదని ఏ భాష నేర్చినా , ఏ యాస పలికినా తెలుగులాంటి తేనే బాషఉండదనీ చదువెంత  యున్నా , సంస్కారం నేర్పే సరళమైన భాష తెలుగేననీ అవయవాలు కదిలించి , ఆరోగ్యం కల్పించే మన తెలుగు భాష ఒకటేననీ తెలుగు జాతి ఖ్యాతిని చూపి , తెలుగోడని ఎలుగెత్తి చూపే భాష మన తెలుగనీ అక్షరాలు ఎన్నున్నా , లక్షణంగా  పలకగల తెలుగు భాష మనదేనని  ఈ అవనిలో  అఖండంగా దశ దిశలా ధ్వనించి రవళించే భాష మన తెలుగనీ  తెలుగును...

Tuesday, 21 February 2017

కవిత నెం 275:*గోవు (గో మాత)*

 కవిత నెం :275 *గోవు (గో మాత)* పరమ పవిత్రతకు , శుభానికి సూచిక 'గోవు' అనాదికాలం నుంచి ఆరాధ్యదైవం 'గోవు' భూమాత ధరించిన రూపం ' గోవు ' ఆదిశక్తి అంశ నుండి జన్మించిన రూపం 'గోవు' హోమంలో నుండి జనించిన అగ్నిగోత్రం 'గోవు ' ముక్కోటి దేవతలకు నిలయం 'గోవు' సమస్త కోరికలను తీర్చే దేవత 'గోవు' ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక 'గోవు' యజ్ఞయాగాది క్రతువులలో పాలు పంచుకోగలిగేది 'గోవు' అతీంద్రియ దర్శన శక్తిని కల్గినది 'గోవు' కన్నతల్లి సమానురాలు 'గోవు ' ప్రతి ఇంటీ కల్పతరువు 'గోవు ' రైతు వెన్నుముక 'గోవు' భూలోక పూజలందుకునే గో మాత 'గోవు' ముల్లోకాలకే విశ్వమాత...

Monday, 20 February 2017

కవిత నెం274:మన ఆవు గురించి మనం తెలుసుకుందాం

కవిత నెం  : 274 అంశం : మన ఆవు గురించి మనం తెలుసుకుందాం (వ్యాస రచన ) గోవు అందరికీ తల్లి . అందుకే వాడుకలో గోమాత అని పిలుస్తాము . గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు . హిందువులకు ఎంతో పవిత్రమైనది , ఆరాద్యమైనది ఆవులో సకల దేవతలు కొలువుంటారని ప్రసిద్ధి గోవు కుడి క్రొమ్ము ప్రక్క బ్రహ్మ , ఎడమ ప్రక్క విష్ణువు , కొమ్ముల చివర సకల తీర్ధాలు , నుదుట శివుడు , ముక్కునందు సుబ్రమణ్యేశ్వరుడు , చెవులందు అశ్వనీ దేవతలు , నేత్రములందు సూర్యచంద్రులు , నాలుకయందు వరుణుడు , గోవు ''హిం' కారమున సరస్వతీ దేవి , గండ స్థలాల యమ ,ధర్మ దేవతలు , కంఠమున ఇంద్రుడు , వక్షస్థలాన...

Friday, 17 February 2017

కవిత నెం 273:ఆటో వాలా

కవిత నెం :273 *ఆటో వాలా * జీవన భృతి కోసం మనిషి పట్టిన మూడు చక్రాల రధం ......... ఒకప్పుడు ఒకటి ,రెండు ,మూడు ఇప్పుడు వందలు కాదు వేలు ఒకడి కింద నలుగుతూ ఉండే కన్నా సొంతంగా సులువైన ఉపాధి ఆటో ఒక కిరాయి కోసం ఎదురుచూపులు కొన్ని సర్వీసులు వస్తే పూట జీతం ఆ ఆటోపైనే ఆధారపడే కుటుంబాలు సాయంత్రానికి లెక్కల ఎక్కాల జాబితాలు వెతుకులాట నుంచి ఆన్ లైన్లో సేవలు అప్పు చేసి మరీ ఆటో నడిపే మేధావులు అణుకువగా ఉండేది కొందరైతే అజమాయిషీ చేసేది మరి కొందరు ఆటో యూనియన్లలో చిక్కేది కొందరు స్వేచ్ఛగా విహరించి సంపాదించేది ఇంకొందరు మండుతున్న  డీజిల్ ధరలు ఒక వైపు పెరుగుతున్న...

Wednesday, 15 February 2017

కవిత నెం 272:అమ్మమ్మ

కవిత నెం :272 * అమ్మమ్మ * అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు రేపటి వెలుగమ్మ అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు భవితకు గతమమ్మ మా అమ్మకు అమ్మవు మమతల పందిరివు ఇంటికే ఇలవేల్పువు మా కంటికే కోవెలవు ముద్దుల అమ్మమ్మ నువ్వే మా పేదరాశి పెద్దమ్మ కల్లాపు జల్లేవు కన్నతల్లిగా సాకేవు పాలు పితికేవు మా ఆకలి కాసేవు అమ్మ అంటే చిరు భయం నీతోనే మా సరదా సమయం అటుకులు బెల్లం అందిచేవు ఆవకాయ రుచిని చూపావు మా అల్లరిని భరించేవు అది చూసి నువ్వు మురిసేవు ఎన్నో కబుర్లు కొత్తగా చెప్పేవు ఆ చందమామలా మమ్ము చూసేవు మా ఆట పాటలకు అమ్మవు నువ్వు మాకు ప్రేమ పంచే అనురాగం నువ్వు మా కష్టం చూసి నొచ్చుకునేవు మా...

కవిత నెం271: ఇదే జీవితం ... !!

కవిత నెం :271 శీర్షిక పేరు : ఇదే జీవితం ... !! ఏది సత్యం ఏది నిత్యం ఏది కృత్యం ఏది నృత్యం ఏది భావం ఏది జాలం ఏది రాగం ఏది త్యాగం ఏది పైత్యం ఏది దౌత్యం ఏది పంతం ఏది శాంతం ఏది రుద్రం ఏది రౌద్రం ఏది ధైర్యం ఏది స్థైర్యం ఏది లౌక్యం ఏది సౌఖ్యం ఏది బంధం ఏది అందం ఏది భోదం ఏది బేధం ఏది కష్టం ఏది నష్టం ఏది స్పష్టం ఏది శ్రేష్టం ఏది లక్ష్యం ఏది సాక్ష్యం ఏది గీత ఏది రాత ఏది భాద ఏది గాధ ఏది భవం ఏది భయం ఏది మూలం ఏది స్థూలం ఏది జన్మం ఏది మర్మం ఏది రమ్యం ఏది ఖర్మం ఏది సాయం ఏది న్యాయం ఏది ఉదయం ఏది సమయం ఏది అంతం ఏది సొంతం ఏది రంగం ఏది భంగం ఏది...

Tuesday, 14 February 2017

కవిత నెం 270: నిన్నే ప్రేమిస్తా

కవిత నెం :270 *నిన్నే ప్రేమిస్తా ** ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని ప్రేమలోన దాగున్న ప్రేమను నాకోసం పంచావు ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నా ప్రాణమై నిలిచావు ప్రేమాక్షర భీజాలను నాలో నాటావు ప్రేమాక్షయ పాత్ర లాగా నిరంతర ప్రేమను ఇస్తున్నావు నిన్ను ప్రేమిస్తూ ,నాలోన నీపై ప్రేమను ప్రేమిస్తూ ''ప్రేమ '' మంత్రం జపిస్తూ ప్రేమికుడిలా పయనిస్తూ నీ ప్రేమ హస్తంతో ప్రేమమయం లో విహరిస్తూ ప్రేమతో నిండిన హృదయాలతో జీవిస్తున్నాము ప్రేమంటే కలవరం అనుకున్నా కాని నువ్వొచ్చాక...

Monday, 13 February 2017

కవిత నెం269: నిశీధిలో నేను

కవిత నెం :269 * నిశీధిలో నేను * నిశీధిలో నేను  దిక్కులు  చూస్తున్నాను  ఆరుబయట మంచం మీద  చల్లని గాలి మెల్లగా చేరి  సేద తీరమని  నా  మేను ను తాకగా ఆకాశంలోని చుక్కలు లెక్కెడుతూ ఏదో ఆలోచనలో నా మనసు పాలపుంతలను పరీక్షగా చూస్తూ ఆ చందమామను చూసి పొంగిపోతూ నిలబడిపోయాను నేను ఒక రూపుగా చలనం లేని రాతి స్తంభంలా కొంచెం కొంచెం నా కనురెప్పలు తమ స్పర్శను నా కనుపాపలకందిస్తూ ఏదో మౌనాన్ని నా చెవులను వినమంటూ అప్పుడప్పుడు లాలాజలాన్ని గుటకలుగా వేస్తూ అలసిపోయిన హృదిని ఊరుకొమ్మంటూ ఏదో కాస్తయినా ఊరట కమ్మంటూ ఒకవైపు వెలుతురు...

Sunday, 5 February 2017

కవిత నెం 268:సొంత గూటి బంధాలు

కవిత నెం  : 268 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :3 * సొంత గూటి బంధాలు * పొద్దున్నే లేవగానే శుభోదయం , శుభదినం అంటూ అందరినీ పలకరిస్తావు పక్కనున్న పెళ్ళాన్ని మాత్రం నవ్వుతూ ఒక చూపు గౌరవంగా ఒక మాట మౌనమే మీ ఇద్దరి మధ్య గోడ ఎవరో ముక్కూ , మొహం తెలియని వారిని భావ - మామ , అన్నయ్య -వదిన అంటూ సంబోదించి మరీ పిలుస్తాం నీ సొంత చెల్లెలతో , అక్కలతో ఒక్కసారి అయినా పద్దతిగా మాట్లాడావా ? ఇంట్లో బంధాలకు జైలు వాటం ఆన్ లైన్లో స్నేహాలకు ఉండదు మొహమాటం నీకు కష్టమొస్తే ఆర్చేది , తీర్చీది వారేనా సంతోషంలో ఏ సొంత బంధం గుర్తు రాదు భాదలో మాత్రం అందరూ కావాలనిపిస్తుంది నీకన్నా...

Saturday, 4 February 2017

కవిత నెం267:భవిష్యత్తు ప్రణాళికలు

కవిత నెం :267 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :2 *భవిష్యత్తు ప్రణాళికలు * నిశ్శబ్దంగా మౌనం  సంకోచంలో మనసు  నన్ను నాలోనే కుదిపేసే ప్రశ్నలు  నీ గమ్యం ఎటువైపు అని ఎదురుచూసే దిక్కులు  మధ్యతరగతి ఈదురు బ్రతుకులు  గాలి వానలో కొట్టుమిట్టాడే కిటికీలు  వర్షం ఆగిపోయాక ఒక చోట నిలిచిపోయే నీరు  ఒక్కసారిగా ప్రశాంతత వైపు చూసే నా చూపు  ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం  తోచిందల్లా చేసుకుని పోతుంటాం  కాసేపు కుందేలు పరుగులు  పున : పరిశీలనతో తాబేలు నడకలు  మన ఎదురుగా అల్లుకుపోయి అగ్గిపెట్టె మేడలు  ఫోజులు...

కవిత నెం266:అది చాలు

కవిత నెం :266 *అది చాలు* కన్నులతో పలకరిస్తే పులకరించిపోతావు   కలలోన కిన్నెరవై వీక్షించిపోతావు నా మాటల మృదులతకు మురిసిపోతుంటావు నా సాంగత్యం కొరకు తపించి తపించిపోతావు నిన్నెలా వదులుకోను నా ముద్ద మందారం నీవిలా ప్రేమిస్తుంటే అది చాలులే బంగారం - గరిమెళ్ళ గమనాలు           ...

Friday, 3 February 2017

కవిత నెం265 :* భార్య బాదితులం *

కవిత నెం  : 265 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :1 * భార్య బాదితులం * (హాస్య కవిత - సరదాకు మాత్రమే) భార్య బాదితులం మేం భార్య బాదితులం పెళ్ళితోనే మొదలవుతుంది మాకు బెండ్ అవ్వమని మా బెండ్ తీస్తారు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మనం సుకుమారంగా వారి తలపై చెయ్యి పెడితే మనల్ని అణగదొక్కేట్టు గట్టిగా ఒత్తుతారు పెళ్ళిలో దండలు మార్చుకునేటప్పుడు మనం వారికన్నా ఎత్తుగా ఉంటే ఎగిరెగిరి మరీ సాధించుకుంటారు అరుంధతీ నక్షత్రం చూపించబోతే మనకు చుక్కలు ఎలా చూపిద్దాం అని అక్కడే ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు ఏవండీ అని పిలవటానికి వారికి ఇబ్బంది అండి అందుకే...

Tuesday, 31 January 2017

కవిత నెం264:* జీవన పోరాటం *

కవిత నెం :264 *జీవన పోరాటం * పొద్దుగాడ లేస్తూనే పొట్టకూటి కోసం ఎన్నో పనులు మరెన్నో బాధ్యతలు గీ రోజు  మంచిగా గడిస్తే చాలు గీ  దినం మనం బతకనీకి సంపాదిత్తే చాలు ఎన్నో హృదయాల ఆర్భాటం మరెన్నో హృదయాల బ్రతుకు పోరాటం మనిషి ఆశలకు హద్దుల్లేవు మనోషి ఊహలకు నియమాలు లేవు కొద్దిమంది  మేడలు , మిద్దెల్లో కాపురముంటే మరి కొద్దిమందికి నిలువ నీడ లేక తపించేవారు ఏముంది ఈ భూమిలో అంతా మట్టేకదా ఏముంది ఈ గాలిలో అంతా తేమే కదా అవి ఉన్నోడికి ,లేనోడికి అంతా ఒకటే కదా మరేంది జట్కాబండి బ్రతుకులు మరేంది ఆకలి అరుపుల ఆర్తనాదాలు ఉన్నోళ్లు ఆశ చావక ఆకాశం వైపు పోతుంటే లేనోడు...

Saturday, 28 January 2017

కవిత నెం263:మేలుకో నవతేజమా

కవిత నెం :263 *మేలుకో నవతేజమా * సమాజాం పిలుస్తుంది రా కదలిరా నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా కలం పట్టి గళం పాడే చోటుంది రా నాలుగు గోడల మధ్య ఏముందిరా నలుగురితో కలిసి చూడు రా కదలిరా నవ్వుకుంటూ ,తిట్టుకుంటూ ఎంతకాలం రా నిజమేంటో నీ సిరాతో చెప్పి చూడరా నీ సుఖం , నీ పక్షం ఎంతసేపురా ఎదుటివారి బాగు కోసం రా కదలిరా న్యాయ అన్యాయాల గుణింతమేలరా ? ఎదురించే గుండె చాలు రా కదలిరా కడుపులోనే కుళ్ళు దాచి కంపుకాకురా ఈ సమాజంలో కుళ్ళు కంపు పెకలిద్దాం రా ఉడుకు నెత్తురుంటే చాలా ఏమాంటావురా ఉడుములాగా ఉరకాలి ఆగిపోకురా నీకెందుకు అనుకుని...

Friday, 27 January 2017

కవిత నెం 262:పిచ్చి మా తల్లి

కవిత నెం :262 *పిచ్చి మా తల్లి * నువ్వెంత మగాడివి అయినా ఏదైనా భరించగలిగే శక్తి ఉన్నది ఒక్క  ''స్త్రీ '' మాత్రమే కానీ తనను , తన ప్రేమను భరించే శక్తి నీకుండాలి అమ్మ ప్రేమను కలిపి తినిపిస్తుంది భార్య  తన ప్రేమను , జీవితాన్ని నీతో పంచుకుంటుంది సోదరి నువ్వు తనకు శ్రీ రామ రక్ష గా భావిస్తుంది పొరపాటున కూడా నీ విసుగు వారిపై ప్రదర్శించకు ఎంత ఎదిగినా ,ఎంత బిజీ గా ఉన్నా వారిని చులకన గా చూడకు తను అలసిన వేళ ,సుకుమారంగా చూసుకో తను విసిగిన వేళ , నీ ఔదార్యం చూపించుకో నీ ఒత్తిడిని తనతో  పంచుకో నీకు ఊరట లభిస్తుంది నీ ప్రేమ ప్రదర్శన కాదు తనకి అది...

కవిత నెం 261:నిద్ర

కవిత నెం :261 నిద్ర గాడంగా మనసు భారంగా కనులు ఆపంగా కునుకు దీర్ఘంగా కనులు ఎరుపెక్క తలంతా తిక్క తిక్క నా కనుబొమ్మలు అటకెక్క నా ఒళ్ళంతా తిమ్మిరెక్క ఎదురుగా ఉంది పని ఆపేది ఏమిటని నాలోన అనుకున్నా గాని కాసేపు కునుకేద్దామని పిలిచాను నిద్రలోకాన్ని నిద్ర భలే దీని ముద్ర భలే ఇది బహు తమాషాలే రమ్మంటే  రాదులే పొమ్మంటే పోదులే పుస్తకం పట్టుకుంటే వస్తుంది మనవెంటే పని చేసుకుందామంటే మొట్టికాయ మొడతదంతే కమ్మగా నిద్రపోగలిగితే అది 'స్వర్గం ' నిద్ర లేక అవస్థపడుంటే అది 'నరకం ' - గరిమెళ్ళ గమనాలు (27. 01. 2017) ...

కవిత నెం260:వెన్నెల్లో అమావాస్య

కవిత నెం :260 *వెన్నెల్లో అమావాస్య * ఒక  నిర్మానుష్యమైన భయం ఒక నిశ్శబ్దపు వాతావరణం ఎక్కడ అలికిడి జరిగిన ఉలిక్కి పడే రోజు రోజులు మారుతున్నా మూడాచారాలు మారవు మనం మారుతున్నా మన నమ్మకాలు మారవు గుండెలు ఎగిరిపడే రోజు చీకటి రాత్రులు విజృభించే రోజు ఉన్మాదపు క్రియలు ఊపిరి పోసుకునే రోజు ఊడల మర్రి 'విలయ తాండవం' చేయు రోజు ఇలా అమావాస్యంటే ఎన్నో ఎన్నో ఆలోచనలు మనం ఊరుకున్నా మన మనసు మాట వినదు ఎక్కడికీ వెళ్లకూడదని .... ఏ పనీ ఈరోజు ఆరభించకూడదు అని ఎన్నో ఎన్నో వినే ఉంటాం .... ఇలాంటివి మన కళ్ళముందు చూస్తూనే ఉంటాం తీవ్రమైన  పూజలు చేస్తూఉంటాం ... విపరీతమైన...

Tuesday, 24 January 2017

కవిత నెం 259:సమయం లేదా మిత్రమా

కవిత నెం :259 * సమయం లేదా మిత్రమా * కాలం చాలా విలువైనది ,నిరంతరంగా ప్రయాణించేది సమయ పాలన విలువ పెరిగి నిజంగానే  క్షణ తీరిక లేకుండా పోతున్నాం బంధాలు , బంధుత్వాలు అంటూ అందరిమధ్యన  పెరిగిన మనకు నేడు ఎవ్వరి తోడూ లేకుండా , ఏకాంతంలో బ్రతుకుతున్నాం అమ్మా , నాన్న తోడు లేకుండా ,వారిని చూడకుండా ఉండలేని రోజులు నేడు వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడలేక విసుక్కుంటున్నాం ఉత్తరాలు , ప్రతుత్తరాలతో కమ్మని కబుర్లు లేఖల్లో పంచుకున్నాం నేడు వాట్స్ అప్ ,ట్విట్టర్స్ అంటూ  కాలాక్షేపాలు చేస్తున్నాం నీ అవసరాల కోసం ఉన్న ఊరుని , కన్న వారిని విడిచి దూరంగా...

Monday, 23 January 2017

కవిత నెం :258

కవిత నెం :258 పసి హృదయంలో ప్రేమని పుట్టించావు ఆశలతో నా మనసుకి నడక నేర్పించావు నీ వలపుల ఊసులతో ఉరకలు వేయించావు అన్నీ చేసి ఇలా ఓడిపొమ్మని నన్నొదిలి వెళ్లిపోయావు ఊహాలోకంలో నా మనసుకి ఊరట నిచ్చింది నీ ప్రేమ ఉలిక్కి పడి చూస్తే అది ఊహే అని ఒప్పించింది కూడా నీ ప్రేమే&nbs...

కవిత నెం257:నేతాజీ నీకు జోహారు

కవిత నెం -257 * నేతాజీ నీకు జోహారు * స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధుడా వెన్ను వంచక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడా జోహార్లు నీకు జోహార్లు పోరుబాట తో ఉద్యమాన్ని  ముందుకు నడిపిన సమరుడా ఆంగ్లేయులు నిర్బంధించినా రొమ్ము చూపిన రణధీరుడా జోహార్లు నీకు జోహార్లు ధైర్యానికి ,సాహసానికి నిలువెత్త్తు రూపం నీవురా భారత స్వాతంత్ర సంగ్రామంతో కదిలిన భవదీయుడా జోహార్లు నీకు జోహార్లు నీవు నమ్మిన సిద్ధాంతాలతో ఫిరంగులా కదిలావురా దేశ దేశాలు తిరిగి సైనికులకు వారధిలా నిలిచావురా జోహార్లు నీకు జోహార్లు ఉడుకు నెత్తురు ఊఫుతోటి ఉడుములా మారావురా కలలు...